కేసీఆర్‌ మౌనం వెనుక కుట్ర: ఉత్తమ్‌

తాజా వార్తలు

Published : 08/08/2020 01:14 IST

కేసీఆర్‌ మౌనం వెనుక కుట్ర: ఉత్తమ్‌

హైదరాబాద్‌: పోతిరెడ్డిపాడు విషయంలో సీఎం కేసీఆర్‌ వైఫల్యం చెందారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. జూమ్‌ యాప్‌ ద్వారా మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. పోతిరెడ్డిపాడు అంశంలో కేసీఆర్‌ మౌనం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీకి హాజరుకాకుండా కేబినెట్‌ భేటీ ఎందుకని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌లో సీమ ఎత్తిపోతలను ఆపే ఒక్క అంశం లేదని చెప్పారు. పిటిషన్‌లో కర్ణాటక, మహారాష్ట్రను ఎందుకు చేర్చారో చెప్పాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా రాకపోతే కేసీఆర్‌ బాధ్యత వహించాలన్నారు. పోతిరెడ్డిపాడు అంశంపై వ్యక్తిగతంగా న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. 

పోతిరెడ్డిపాడు, రాయలసీమ లిఫ్ట్‌ వల్ల శ్రీశైలం-సాగర్‌కు నీళ్లు రావని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. ఏపీ జీవో వల్ల హైదరాబాద్‌ ప్రజలకు నీటి సమస్య వస్తుందన్నారు. పోతిరెడ్డిపాడు అంశంపై పోరాటం చేయాల్సిన అవసరముందని చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని