కేజ్రీవాల్‌ది ఎన్నికల అజెండా మాత్రమే..!

తాజా వార్తలు

Published : 11/07/2021 01:06 IST

కేజ్రీవాల్‌ది ఎన్నికల అజెండా మాత్రమే..!

దేహ్రాదూన్‌: ఉచిత విద్యుత్‌పై దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇస్తున్న హామీలు ఎన్నికల అజెండాలో భాగమేనంటూ ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ థామి విమర్శించారు. ఉత్తరాఖండ్‌లో ఉచిత విద్యుత్‌ అందజేసే అంశంలో శనివారం కేజ్రీవాల్‌ చేసిన ట్వీట్‌పై ఆయన స్పందించారు. తాము ఎన్నికల్లో విజయాన్ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకొని పని చేయడం లేదన్నారు. ‘‘ఎన్నికల్లో గెలిచేందుకు కేజ్రీవాల్‌ ఉచిత విద్యుత్‌ హామీ ఇస్తుండొచ్చు. కానీ ప్రజలకు అత్యుత్తమ పరిపాలన అందించడమే మా లక్ష్యం’’ అని ఆయన వెల్లడించారు.

తాను ఆదివారం దేహ్రాదూన్‌కు వెళ్లనున్నట్లు అరవింద్ కేజ్రీవాల్‌ శనివారం ప్రకటించారు. అయితే ఆయన ఉత్తరాఖండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ‘‘ఉత్తరాఖండ్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేసి ఇతర రాష్ట్రాలకు సైతం సరఫరా చేస్తుంది. అయినా అక్కడి ప్రజలకు విద్యుత్‌ చాలా ఖరీదైంది. దిల్లీ ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తుంది. అయినా ఇక్కడ విద్యుత్‌ ఉచితం’’ అని ఆయన ట్వీట్ చేశారు. 2022లో పంజాబ్‌లో జరగబోయే ఎన్నికల్లో తాము విజయం సాధిస్తే విద్యుత్‌ ఉచితంగా ఇస్తామంటూ కేజ్రీవాల్ ఇంతకుముందు ప్రకటించారు.  

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని