ఆ ఘటనకు వీర్రాజు బాధ్యత తీసుకుంటారా?

తాజా వార్తలు

Published : 13/09/2020 01:23 IST

ఆ ఘటనకు వీర్రాజు బాధ్యత తీసుకుంటారా?

అమరావతి: అంతర్వేది ఘటన తర్వాత కుట్ర పూరితంగా ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. భాజపా ఈ రాష్ట్రంలో పాగా వేసేందుకు ఇక్కడ మతపరమైన అంశాలను లేవదీస్తోందన్నారు. 2017 అక్టోబర్‌ 19న పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడులో రథం దగ్ధమైనా భాజపా- జనసేన భాగస్వాములుగా ఉన్న అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అప్పటి ఘటనపై ప్రస్తుత భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు బాధ్యత తీసుకుంటారా? అని ప్రశ్నించారు. ఇప్పుడు మాత్రం అందరూ నోరు విప్పుతున్నారని అన్నారు.

దేవాలయాలపై రాజకీయాలు చేయడం మానేయాలని విపక్షాలకు వెల్లంపల్లి సూచించారు. ఈ ఘటనపై కొందరు సీబీఐను కోరారని, తాము సీబీఐకి అప్పగించామని చెప్పారు. ఫాంహౌస్‌లో కూర్చుని పవన్‌ కల్యాణ్‌, జూమ్‌ కాన్ఫరెన్స్‌ల్లో చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఏదో జరుగుతోందంటూ ఈ రాష్ట్రంలో పాగా వేసేందుకు భాజపా నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సీబీఐ విచారణలో వాస్తవాలు తేలుతాయన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని