‘విశాఖ కార్పొరేషన్‌లో వైకాపాదే విజయం’
close

తాజా వార్తలు

Updated : 06/03/2021 11:02 IST

‘విశాఖ కార్పొరేషన్‌లో వైకాపాదే విజయం’

ఎంపీ విజయసాయిరెడ్డి

విశాఖ: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బంద్‌ విజయవంతమైందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయనున్నట్లు సీఎం ప్రకటించారని గుర్తు చేశారు. విశాఖకు పరిపాలనా రాజధాని రావడం ఖాయమని స్పష్టం చేశారు. త్వరలో జరగనున్న విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైకాపా విజయం సాధిస్తుందని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

భాజపా-జనసేన ఆపాలి..

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను భాజపా-జనసేన అడ్డుకోవాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. నగర అభివృద్ధిని తెదేపా అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌ అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు అడ్డుపడినా విశాఖ పరిపాలనా రాజధాని కావడం ఖాయమని అవంతి స్పష్టం చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని