దేవుడి చేతిలో గ్రామాలు: రాహుల్‌ గాంధీ

తాజా వార్తలు

Updated : 10/05/2021 12:42 IST

దేవుడి చేతిలో గ్రామాలు: రాహుల్‌ గాంధీ

దేశానికి ఊపిరి కావాలి.. ప్రధాని నివాసం కాదన్న కాంగ్రెస్‌ నేత

దిల్లీ: కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తోన్న వేళ.. కేవలం నగరాలే కాదు, గ్రామాలు కూడా దేవుడి మీదే ఆధారపడి ఉన్నాయని కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ప్రస్తుం దేశానికి ఊపిరి కావాలని.. ప్రధానమంత్రి నివాసం కాదని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఓవైపు ఆక్సిజన్‌ కొరతతో రోగుల బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో సెంట్రల్‌ విస్టా పనులను కొనసాగించడం పట్ల కేంద్ర ప్రభుత్వం తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.

కరోనా విజృంభణతో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కొవిడ్‌ బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావించిన రాహుల్‌ గాంధీ రీఫిల్లింగ్‌ కోసం ఆక్సిజన్‌ సిలిండర్లతో వేచిచూస్తున్న బాధితులు, సెంట్రల్‌ విస్టా పనులు కొనసాగుతున్న ఫోటోలను రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో పోస్టు చేశారు. దేశానికి ప్రస్తుతం ప్రధాని నివాసం కాదని.. ఊపిరి కావాలని అభిప్రాయపడ్డారు.

ఇక దేశ రాజధానిలో లాక్‌డౌన్‌ సమయంలో సెంట్రల్‌ విస్టా పనులను కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని కాంగ్రెస్‌ నాయకులు తప్పుబడుతున్నారు. ఈ పనులు సజావుగా సాగేందుకు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని అత్యవసర సేవల కిందకు తీసుకురావడం ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోందని విమర్శిస్తున్నారు. దేశంలో కరోనా కట్టడి చేసేందుకు సరైన కార్యాచరణ రూపొందించాలని, వీటిపై చర్చించేందుకు వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని