నేడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కానున్న శశికళ
close

తాజా వార్తలు

Updated : 31/01/2021 05:20 IST

నేడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కానున్న శశికళ

బెంగళూరు: ఏఐఏడీఎంకే బహిష్కృత నేత, తమిళనాడు మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు వీకే శశికళ ఆస్పత్రి నుంచి ఆదివారం డిశ్చార్జి కానున్నారు. ఈ విషయాన్ని బెంగళూరు వైద్య కళాశాల శనివారం విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో వెల్లడించింది. శ్వాస సంబంధిత సమస్యలతో వారం క్రితం ఆస్పత్రిలో చేరిన శశికళకు పరీక్షలు నిర్వహించగా.. కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్దారణ అయిన విషయం తెలిసిందే. 

‘శశికళకు పదిరోజుల చికిత్స పూర్తైంది. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి కొవిడ్‌ లక్షణాలు లేవు. గత మూడు రోజులుగా ఆక్సిజన్‌ లేకుండా తాను శ్వాస తీసుకోగలుగుతున్నారు. ఇక ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవ్వొచ్చు. వైద్యుల హోంక్వారంటైన్‌ సూచన మేరకు ఆమె రేపు విడుదల కానున్నారు’ అని బెంగళూరు వైద్య కళాశాల విడుదల చేసిన ఆరోగ్య నివేదిక వెల్లడించింది. 

2017లో అవినీతి కేసులో అరెస్టై నాలుగేళ్ల శిక్ష అనుభవించిన శశికళ, జనవరి 27న బెంగళూరు జైలు నుంచి విడుదలయ్యారు. అంతకుముందే జనవరి 20న ఆమె అనారోగ్యం బారిన పడటంతో.. జైలు అధికారులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో జైలు అధికారులు ఆమె విడుదలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను ఆస్పత్రి నుంచే పూర్తి చేశారు.  

ఇదీ చదవండి

దిల్లీ పేలుడు ఆ ఉగ్రవాదుల పనేనా?


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని