‘కోచ్‌బిహార్‌’ బాధ్యులను శిక్షిస్తాం: దీదీ
close

తాజా వార్తలు

Published : 15/04/2021 01:25 IST

‘కోచ్‌బిహార్‌’ బాధ్యులను శిక్షిస్తాం: దీదీ

మఠభంగా: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడత పోలింగ్‌ సందర్భంగా కోచ్‌బిహార్‌లో చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. బుధవారం సీతల్‌కుచి వెళ్లిన దీదీ.. బాధిత కుటుంబాలను పరామర్శించారు. కాల్పుల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించనున్నట్లు తెలిపారు. 

ఈ ఉదయం కోచ్‌బిహార్‌ వెళ్లిన మమత.. మృతుల కుటుంబసభ్యులను కలిసి వారిని ఓదార్చారు. ‘‘ఒక బాధితుడి భార్య గర్భిణి. మరో చిన్న శిశువు తండ్రిని కోల్పోవాల్సి వచ్చింది. కాల్పులు ఘటనకు పాల్పడిందెవరైనా సరే.. వారిని గుర్తిస్తాం. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం. ఎన్నికల హింసలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు బెంగాల్‌ ప్రభుత్వం అండగా ఉంటుంది. యువ ఓటరు ఆనంద్‌ బుర్మన్‌ కుటుంబానికి కూడా న్యాయం అందిస్తాం’’ అని దీదీ భరోసానిచ్చారు.

ఏప్రిల్‌ 11న నాలుగో విడత పోలింగ్‌ సందర్భంగా సీతల్‌కుచిలోని ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆందోళనకారులను అడ్డుకునేందుకు సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది జరిపిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు ఇదే ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఓ యువ ఓటరు చనిపోయాడు. ఈ ఘటన బెంగాల్‌లో రాజకీయ దుమారానికి దారితీసింది. కాల్పుల ఘటనపై భాజపా, టీఎంసీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని