close

తాజా వార్తలు

Published : 11/04/2021 02:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కోచ్‌బిహార్‌ ఘటన బాధాకరం: మోదీ

సిలిగుడి: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడత పోలింగ్‌ కొనసాగుతున్న వేళ కోచ్‌బిహార్‌లో చోటుచేసుకున్న కాల్పుల ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిల్గురిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ‘‘కోచ్‌బిహార్‌లో జరిగిన ఘటన విచారకరం. కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నా. ఘటనపై లోతుగా దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను కోరుతున్నా’’ అని మోదీ చెప్పారు.

ఈ సందర్భంగా టీఎంసీ అధినేత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘‘భాజపాకు ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూసి దీదీ(మమతా బెనర్జీ), ఆమె గూండాలు కలవరపడుతున్నారు.  ఇకనైనా ఈ ఉదంతాలు ఆగాలి. దీదీకి నేను చెప్పేది ఒక్కటే.. టీఎంసీ, వారి గూండాల అరాచకాలు ఇక పనిచేయవు. దోపిడీదారులపై ఆమె ఎన్నడూ ఆగ్రహం వ్యక్తం చేయరు. కానీ ప్రజల హక్కులను రక్షించే భద్రతా బలగాలపై ఆరోపణలు చేస్తున్నారు’’ అని మోదీ దుయ్యబట్టారు.

పోలింగ్‌ వాయిదా..

మరోవైపు కాల్పుల ఘటన నేపథ్యంలో కోచ్‌బిహార్‌లోని సీతల్‌కుచి నియోజకవర్గ పరిధిలో గల 126వ పోలింగ్‌ కేంద్రంలో పోలింగ్‌ వాయిదా పడింది. ఎన్నికల పరిశీలకుల నివేదిక ఆధారంగా ఓటింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు ఈసీ అధికారులు వెల్లడించారు. సాయంత్రానికి ఘటనపై పూర్తి నివేదిక రానున్నట్లు తెలిపారు.

ఈ పోలింగ్‌ కేంద్రం వద్ద ఈ ఉదయం ఓ యువ ఓటరుపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం టీఎంసీ, భాజపా కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. బాంబులు విసురుకున్నారు. వారిని చెదరగొట్టే క్రమంలో భద్రతా బలగాలు కాల్పులు జరపగా.. నలుగురు ప్రాణాలు కోల్పోయారు.



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని