AIADMK: 15మందిపై వేటు..చిన్నమ్మ బాధపడింది!
close

తాజా వార్తలు

Published : 16/06/2021 01:18 IST

AIADMK: 15మందిపై వేటు..చిన్నమ్మ బాధపడింది!

మరో ఆడియో క్లిప్‌ విడుదల

చెన్నై: తనతో టచ్‌లో ఉన్న అన్నాడీఎంకే కార్యకర్తలను పార్టీ నుంచి బహిష్కరించడంపై తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత నెచ్చెలి శశికళ స్పందించారు. తనతో ఫోన్‌ సంభాషణలు జరిపిన వారిపై వేటు వేయడం బాధించిందన్నారు. కార్యకర్తలపై వేటు వేసిన మరుసటి రోజే కొత్తగా మరో ఆడియో టేప్‌ ఒకటి బయటకు వచ్చింది. అందులో ‘త్వరలోనే వస్తా.. పార్టీని సరిచేద్దాం’’ అంటూ ఆమె వ్యాఖ్యానించినట్టుగా టేపుల్లో ఉండటం గమనార్హం.  అలాగే, ‘‘రాష్ట్రంలో ఇతర ఎన్నికలు వస్తున్నాయి. మనమే విజయం సాధించాలి. జయలలిత వారసత్వాన్ని కాపాడుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్న మనం పార్టీ కార్యకర్తలను బహిష్కరించడం నన్ను బాధించింది’’ అని శశికళ పేర్కొన్నట్టు టేపులో రికార్డయింది.

మరోవైపు, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించారని పేర్కొంటూ అన్నాడీఎంకే అధికార ప్రతినిధి వి.పుగళెందితో పాటు మొత్తం 15మందిని పార్టీ నుంచి బహిష్కరిస్తూ సోమవారం తీర్మానం ఆమోదించిన విషయం తెలిసిందే. అలాగే, శశికళ తమ పార్టీ కార్యకర్తలతో మాట్లాడటం ద్వారా ఎత్తులు వేస్తూ డ్రామాలు ఆడుతున్నారని అన్నాడీఎంకే పేర్కొంది. ఆమెతో సంబంధాలను కొనసాగిస్తే చర్యలు తప్పవంటూ శ్రేణులను హెచ్చరించింది. 

అన్నాడీఎంకేలో అంతర్గత పోరుపై ఆమె ఆవేదన వ్యక్తంచేసినట్టు ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన ఆడియో టేప్‌ల్లో స్పష్టమవుతోంది. అలాగే, ఆమె త్వరలోనే రాజకీయాల్లోకి తిరిగి వస్తారనే సంకేతాలు కనబడుతున్నాయి.  అయితే, కొత్తగా బయటకు వచ్చిన ఆడియో టేప్‌లో ఓ కార్యకర్తతో ‘‘లాక్‌డౌన్‌ వల్ల నేను బయటకు రాలేకపోతున్నా. కచ్చితంగా త్వరలోనే తిరిగి వస్తా. తప్పకుండా వస్తా.. ఆందోళన వద్దు. మీ అందరినీ కలుస్తా’’ అంటూ శశికళ వ్యాఖ్యానించినట్టుగా ఉంది. శశికళతో కొందరు మద్దతుదారులు జరిపిన ఫోన్‌ సంభాషణల ఆడియోలు గత నెలలో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ సంభాషణల్లో ఆమె జైలు నుంచి బయటకొచ్చాక రాజకీయ ప్రణాళికలు, అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి తదితర అంశాలపై మాట్లాడినట్టు తెలియజేస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించిన శశికళ.. ఇప్పుడు మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు కనబడుతోంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని