దమ్ముంటే వైకాపా సిద్ధం కావాలి: యనమల

తాజా వార్తలు

Published : 18/11/2020 10:20 IST

దమ్ముంటే వైకాపా సిద్ధం కావాలి: యనమల

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ సన్నద్ధమవుతుండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని చెబుతోంది. దీంతో స్థానిక ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో మాటల యద్ధం కొనసాగుతోంది.  ఓటమి భయంతోనే ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలంటే వైకాపా వెనుకంజ వేస్తోందని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...కేంద్రానికి, ఇతర రాష్ట్రాలకు లేని కరోనా సాకులు వైకాపా ఎందుకు చెబుతోందని ప్రశ్నించారు. బాధిత వర్గాలన్నీ వ్యతిరేకంగా ఓటేస్తారనేదే వైకాపా భయమని విమర్శించారు. 

ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీల్లో వ్యతిరేకత చూసే వెనక్కితగ్గుతున్నారని ఆరోపించారు. కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు జరిగితే ఓడిపోతామని వైకాపా నేతలకు భయం పట్టుకుందన్నారు. దమ్ముంటే ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలకు వైకాపా సిద్ధం కావాలని సవాల్‌ విసిరారు. గతంలో జరిగిన బలవంతపు ఏకగ్రీవాలు పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. స్థానిక ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండగా సీఎస్‌ జోక్యం అనుచితమన్నారు.73, 74 రాజ్యాంగ అధికరణలను గౌరవించాలని, గవర్నర్‌ కూడా స్థానిక ఎన్నికల నిర్వహణకు సహకరించాలని యనమల విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి

ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు: సీఎస్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని