స్వరూపానందపై ఎందుకంత ప్రేమ?: యనమల

తాజా వార్తలు

Published : 15/11/2020 03:42 IST

స్వరూపానందపై ఎందుకంత ప్రేమ?: యనమల

అమరావతి: ఏపీ సీఎం జగన్‌ రోజుకో దుష్ట సంప్రదాయంతో రాష్ట్ర ప్రజల ప్రతిష్ట, లౌకిక విలువల్ని దిగజారుస్తున్నారని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఈనెల 18న విశాఖ శారదాపీఠం స్వామీజీ స్వరూపానంద పుట్టినరోజును పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా  23 దేవాలయాల నుంచి ఆలయ మర్యాదలు, కానుకలు పంపాలన్న దేవాదాయ శాఖ ఆదేశాలను యనమల తప్పుబట్టారు.

జగన్‌ తన స్వామి భక్తి కోసం 5కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని కించపర్చటం హేయమన్నారు. దేవాలయాలు, స్వామీజీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం పాటించే సంప్రదాయాలకు ఈ ఆదేశాలు వ్యతిరేకమన్నారు. స్వరూపానందపై అంత ప్రేమ ఉంటే సొంత ఖజానా నుంచి కానుకలు ఇవ్వాలే తప్ప .. అధికార దుర్వినియోగం ఏంటని ప్రశ్నించారు. అధికార యంత్రాంగాన్ని ఒక ప్రైవేటు పీఠం ముందు మోకరిల్లజేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చినజీయర్‌స్వామి, కంచి కామకోటి పీఠాధిపతిలాంటి ఇతర స్వామీజల పుట్టినరోజులకు లేని మర్యాదలు స్వరూపానందకు చేయడం వారందరినీ కించపరచడమేనని యనమల విమర్శించారు.

ఇదీ చదవండి ..

స్వరూపానందేంద్ర జన్మదినంపై ప్రత్యేక ఆదేశాలుTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని