AP news: జగన్‌ కేసుల విచారణలో వేగమేది?

తాజా వార్తలు

Updated : 24/06/2021 12:33 IST

AP news: జగన్‌ కేసుల విచారణలో వేగమేది?

యనమల రామకృష్ణుడు

అమరావతి: వివిధ ఆర్థిక కుంభకోణాల్లో నిందితులుగా ఉన్న విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ ఆస్తులను ఈడీ కేంద్ర ప్రభుత్వానికి అప్పగించిందని, ఈ ముగ్గురి కేసుల్లో ఉన్న వేగం సీఎం జగన్‌ కేసుల్లో లేకపోవడం శోచనీయమని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్‌కు చెందిన రూ.43 వేల కోట్ల అక్రమ సంపదనంతా స్వాధీనం చేసుకొని, ప్రజాపరం చేయాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ ఆర్థిక నేరాల విచారణలో ఏళ్ల తరబడి జాప్యం తగదన్నారు. వెంటనే చర్యలు చేపడితేనే ప్రజల్లో వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుందని చెప్పారు. 108మంది వ్యక్తులు, 100కు పైగా కంపెనీలు, నలుగురు మంత్రులు, 10మంది ఐఏఎస్ అధికారులు, ఐదుగురు ఉన్నతాధికారుల గూడు పుఠాణితో జగన్‌ది దేశంలోనే అతిపెద్ద ఆర్ధిక కుంభకోణమని యనమల ఆరోపించారు. స్వల్పకాలంనే దాదాపు 1100రెట్లు అవినీతి సంపద పెరగటం పట్ల సుప్రీం కోర్టు న్యాయమూర్తే విస్తుపోయారని గుర్తుచేసిన యనమల..., రూ.43వేల కోట్లలో దాదాపు రూ.10వేల కోట్ల ఆస్తులను ఇప్పటికే జప్తు చేసినందున మిగిలిన అక్రమ సంపదను ప్రభుత్వానికి అప్పగించాలని సూచించారు. జగన్ ఆర్థిక నేరాలకు సంబంధించి రూపొందించిన 47పేజీల అఫిడవిట్ లో 18పేజీలు ఆయన అవినీతికి అద్దం పడుతున్నాయని ధ్వజమెత్తారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని