‘అధిష్ఠానానికి విశ్వాసం ఉన్నంత వరకు సీఎంగా ఉంటా’

తాజా వార్తలు

Published : 07/06/2021 01:12 IST

‘అధిష్ఠానానికి విశ్వాసం ఉన్నంత వరకు సీఎంగా ఉంటా’

కర్ణాటకలో నాయకత్వ మార్పుపై స్పందించిన యడియూరప్ప

బెంగళూరు: కర్ణాటకలో నాయకత్వ మార్పు చోటుచేసుకోనున్నట్లు వస్తున్న ఊహాగానాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప స్పందించారు. భాజపా అధిష్ఠానానికి తనపై విశ్వాసం ఉన్నంత వరకు తానే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతానని చెప్పుకొచ్చారు. అయితే, తన స్థానాన్ని భర్తీ చేసే ప్రత్యామ్నాయ నాయకత్వం రాష్ట్ర భాజపా శాఖలో లేదంటే మాత్రం తాను అంగీకరించబోనన్నారు. పరోక్షంగా తనకు పోటీ ఇవ్వగల నాయకులు ఉన్నారని అభిప్రాయపడ్డారు. అధిష్ఠానం తనని వద్దనుకున్న రోజు వెంటనే రాజీనామా చేసి రాష్ట్ర అభివృద్ధికి రేయింబవళ్లు కష్టపడతానని వ్యాఖ్యానించారు.

పార్టీ అధినాయకత్వం తనకు అవకాశం ఇచ్చిందని.. దాన్ని ఉపయోగించుకునేందుకు శక్తికి మించి కృషి చేస్తున్నానని యడియూరప్ప అన్నారు. మిగిలిన విషయాలు అధిష్ఠానమే చూసుకుంటుందన్నారు. కర్ణాటకలో భాజపా ఎమ్మెల్యేలు కొందరు యడియూరప్ప పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి యోగీశ్వర, హుబ్బళ్లి-ధార్వాడ్‌ ఎమ్మెల్యే అరవింద్‌ బెల్లాడ్‌ దిల్లీ వెళ్లి వచ్చారు. దీంతో నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలు జోరందుకున్న నేపథ్యంలో యడియూరప్ప స్పందించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని