సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పాలి: షర్మిల
close

తాజా వార్తలు

Updated : 15/04/2021 16:17 IST

సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పాలి: షర్మిల

హైదరాబాద్‌: నిరుద్యోగుల బలవన్మరణాలపై సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పాలని వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు మద్దతుగా ఎవరు మాట్లాడకపోయినా.. తాను అండగా ఉంటానన్నారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఇందిరాపార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్‌లో షర్మిల ఈ ఉదయం ఉద్యోగ దీక్ష చేపట్టారు. ఈ సాయంత్రం 5 గంటల వరకే దీక్ష కొనసాగించడానికి పోలీసులు అనుమతించినా.. యువతకు సంఘీభావంగా 72 గంటల పాటు దీక్ష చేస్తానని ఆమె ప్రకటించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేపట్టేదాక రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు, నిరసనలు కొనసాగుతాయని షర్మిల వెల్లడించారు. ఉద్యోగాల భర్తీ చేపట్టకపోవడంతో యువకులు బలవన్మరణాలకు పాల్పడుతున్నా.. సీఎం కేసీఆర్‌ పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ముందుండి పోరాటం చేసిన యువత కోసం వెంటనే ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని దీక్ష స్థలి నుంచి ఆమె డిమాండ్‌ చేశారు.  Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని