జమ్మలమడుగు టికెట్‌పై వైకాపా క్లారిటీ
close

తాజా వార్తలు

Updated : 09/04/2021 23:43 IST

జమ్మలమడుగు టికెట్‌పై వైకాపా క్లారిటీ

అమరావతి: కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన వైకాపా నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి సీఎం జగన్‌ను కలిశారు. వైకాపా ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని జగన్‌కు రామసుబ్బారెడ్డి వివరించారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు.

స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేతో సమన్వయం చేసుకోవాలని రామసుబ్బారెడ్డికి సీఎం జగన్‌ సూచించినట్లు సజ్జల తెలిపారు. 2024 ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్‌రెడ్డే పోటీ చేస్తారని.. రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జమ్మలమడుగు రెండు స్థానాలు అవుతుందని.. అప్పుడు చెరో చోట నుంచి రామసుబ్బారెడ్డి, సుధీర్‌రెడ్డి పోటీ చేస్తారని సజ్జల తెలిపారు. రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ క్రియాశీలక గుర్తింపు ఇస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారని చెప్పారు. తన వెంట పార్టీలోకి వచ్చిన వారికి గౌరవం, గుర్తింపు ఇవ్వాలని కోరానన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో సుధీర్‌రెడ్డికి మద్దతిస్తామని ఆయన స్పష్టం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని