
తాజా వార్తలు
ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైకాపా
అమరావతి: త్వరలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను వైకాపా ప్రకటించింది. ఈ మేరకు సీఎం జగన్ అభ్యర్థులను ఖరారు చేశారు. అభ్యర్థుల పేర్లను వైకాపా సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఇటీవల మృతిచెందిన తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్, చల్లా రామకృష్ణారెడ్డి కుమారులకు అవకాశం కల్పించారు.
దుర్గాప్రసాద్ కుమారుడు కల్యాణచక్రవర్తి, రామకృష్ణారెడ్డి కుమారుడు భగీరథరెడ్డిలను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. వీరితో పాటు శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైకాపా ఇన్ఛార్జ్ దువ్వాడ శ్రీనివాస్, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య, హిందూపురం వైకాపా నేత మహ్మద్ ఇక్బాల్, విజయవాడకు చెందిన కరీమున్నీసాను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సీఎం ఎంపిక చేశారు.
ఇవీ చదవండి
Tags :