అందుకే రాళ్ల దాడి డ్రామా: అంబటి
close

తాజా వార్తలు

Published : 13/04/2021 16:15 IST

అందుకే రాళ్ల దాడి డ్రామా: అంబటి

తిరుపతి: తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో తెదేపాకు 30శాతం లోపే ఓట్లు వస్తాయని సర్వేలు చెబుతున్నాయని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. తెదేపా ఓటమి ఖాయమైందని.. అందుకే రాళ్ల దాడి డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ క్వారంటైన్‌కు వెళ్లింది భయపడా? డబ్బు అందకా? అని ప్రశ్నించారు. 

జేపీ నడ్డా భాజపా జాతీయ అధ్యక్షుడి స్థాయి నుంచి తెదేపా అధ్యక్షుడి స్థాయికి పడిపోయారని అంబటి ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకుని ఆయన మాట్లాడాలన్నారు. ప్రైవేట్‌ పోర్టులో షేర్లను అదానీ గ్రూప్‌ కొంటే వైకాపాకు సంబంధమేంటని ప్రశ్నించారు. ప్రధాని మోదీని సీఎం జగన్‌ పలుమార్లు కలిసినా కేంద్ర ప్రభుత్వం విభజన  హామీలు నెరవేర్చలేదని అంబటి ఆరోపించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని