close

ప్రధానాంశాలు

దోషులను శిక్షించాల్సిందే: అసదుద్దీన్‌

అబిడ్స్‌, న్యూస్‌టుడే, ఈనాడు, హైదరాబాద్‌:  భైంసాలో ఆదివారం రాత్రి జరిగిన హింసాత్మక అల్లర్లను ఖండిస్తున్నట్లు ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ పేర్కొన్నారు. బాధ్యులైన వారిని శిక్షించాలని తెలంగాణ సీఎంవో, డీజీపీని ట్విటర్‌లో కోరారు. ఆరేళ్లుగా రాష్ట్రంలో మతపరమైన ఏ చిన్న ఘటనా చోటుచేసుకోలేదని.. ఈ అల్లర్లను తొలుత కొన్ని మతపరమైన శక్తులు రెచ్చగొట్టి చేసినట్లు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. శనివారం జరిగిన ఒక ఘటనకు ప్రతీకారంగా ఆదివారం మరో ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు.

మత ఘర్షణలను నివారించాలి: తమ్మినేని
భైంసాలో జరుగుతున్న హింసాత్మక ఘటనల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. మత ఘర్షణల నివారణపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని కోరారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.