close

ప్రధానాంశాలు

పతంగిలా ఎగరాలి తెరాస అంతటా గెలవాలి

ఇంటింటికీ తిరగాలని పార్టీ ఎమ్మెల్యేలకు కేటీఆర్‌ ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌ : రాష్ట్రంలో పుర, నగరపాలక ఎన్నికలకు సబంధించి ప్రచారం ముమ్మరం చేయాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత మంగళవారం సాయంత్రం కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలు, పురపాలక సంఘాల వారిగా జాబితాలను పరిశీలించారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రచారంలో ఎక్కడా లోటు పాట్లు లేకుండా చూడాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో ఏకగ్రీవమైన అభ్యర్థులను, అందుకు కృషి చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలను కేటీఆర్‌ పేరుపేరునా అభినందించారు. అదే స్ఫూర్తిని ఎన్నికల్లో ప్రదర్శించాలని కోరారు.

గాలిపటాలంటే ఇష్టం
తెలంగాణభవన్‌పై కేటీఆర్‌ మంగళవారం పతంగులను ఎగురవేశారు. గులాబీ రంగు పతంగుల మాదిరే తెరాస జెండా అన్ని పుర, నగరపాలక సంస్థల్లో ఎగరాలని ఆయన ఆకాంక్షించారు. చిన్నతనం నుంచి తనకు పతంగులంటే ఇష్టమని ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి,  ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ ఛైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, కార్పొరేషన్‌ ఛైర్మన్లు మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, హైదరాబాద్‌ మేయరు బొంతు రామ్మోహన్‌, టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లుశ్రీనివాస్‌యాదవ్‌, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.