close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇకనైనా ప్రజలకు ఏం చేస్తారో ప్రధాని చెప్పాలి

రాహుల్‌గాంధీ

ఈనాడు, దిల్లీ: ప్రధానమంత్రి ప్రకటించిన నాలుగు దశల లాక్‌డౌన్‌ విఫలమైందని, ఇకమీదటైనా ప్రజలకు ఏం చేస్తారో? లాక్‌డౌన్‌ను ఎలా తెరవనున్నారో? ప్రధాని మోదీ ప్రజలకు చెప్పాలని ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన జూమ్‌ ద్వారా మాట్లాడారు. పేద కుటుంబాలకు నెలకు రూ.7,500 నగదు బదిలీ చేయాలని, చిన్న పరిశ్రమలను ఆదుకోవాలన్నారు. ‘‘ప్రధానమంత్రి తొలి లాక్‌డౌన్‌ ప్రకటించే సమయంలో 21 రోజుల్లో కొవిడ్‌ను ఓడిస్తామన్నారు. ఇప్పుడు నాలుగు దశలుగా 60 రోజులైంది. ప్రపంచంలో ఎక్కడా లేనంత తీవ్రస్థాయిలో ఇప్పుడు భారత్‌లో వైరస్‌ వ్యాపిస్తోంది. లాక్‌డౌన్‌ విఫలమైన నేపథ్యంలో ప్రభుత్వ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? దేశం తలుపులు తెరవడానికి ఏం చేయబోతున్నారు?’’ అని రాహుల్‌ ప్రశ్నించారు.

అనుమతిస్తే లగేజీ మోసుకెళ్తా..
రాహుల్‌కు పేదలపై ప్రేమ ఉంటే వారి లగేజీ మోసుకెళ్లాల్సిందంటూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ‘‘వారు అనుమతిస్తే ఒకరిది కాదు.. పది, పదిహేను మంది లగేజీ మోసుకెళ్తా. దిల్లీ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు నడిచి వెళ్లడానికి అనుమతిస్తే మార్గమధ్యలో ఎంతమందికి వీలైతే అంతమందికి సాయం చేసుకుంటూ వెళ్తాను’’ అన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.