close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చమురు ధరల పెంపు అసమంజసం

ధర్నాలో ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

శంషాబాద్‌, న్యూస్‌టుడే: అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు తగ్గుతుండగా భారత్‌లో పెంచడం అమానవీయమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం రంగారెడ్డి  జిల్లా శంషాబాద్‌ పట్టణంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. అదనపు ఎక్సైజ్‌ సుంకం పేరుతో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆరేళ్లలో దేశ ప్రజల నుంచి రూ.18 లక్షల కోట్లు వసూలు చేసిందని ఆరోపించారు. మూడున్నర నెలల్లో డీ  జిల్‌పై రూ.26, పెట్రోల్‌పై రూ.21 పెంచడం సమంజసం కాదన్నారు. యూపీఏ హయాంలో చమురు బ్యారెల్‌ ధర 40 డాలర్లు ఉండగా.. పెట్రోల్‌ రూ.30, డీ  జిల్‌ రూ.25లకే అందించినట్లు గుర్తుచేశారు. ధరలు తగ్గించాలని దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టి రాష్ట్రపతిని ఉద్దేశించి వినతిపత్రాలు అందజేస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ పట్టణాధ్యక్షుడు పి.సంజయ్‌యాదవ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో భాగంగా తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. చేవెళ్ల మాజీ ఎంపీ కె.విశ్వేశ్వర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇంధన ధరల పెంపుతో వ్యవసాయ రంగంపై భారం
పెట్రోలు, డీ జిల్‌ ధరల పెంపుతో వ్యవసాయ రంగం కుదేలవుతోందని, ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర పెట్రోలియం, ఇంధన వనరుల శాఖ మంత్రి  ధర్మేంద్ర ప్రధాన్‌కు అఖిల భారత కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి శనివారం లేఖ రాశారు.
ప్రాజెక్టుల్లో నాణ్యత డొల్ల: ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి
రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల్లో నాణ్యత డొల్లగా మారిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన మాట్లాడారు. భాజపా జాతీయ నాయకులు మాటలకే పరిమితం అవుతున్నారన్నారు. ప్రాజెక్టుల్లో లోపాలపై పూర్తి సమాచారం తాము అందిస్తామని, సీబీఐతో విచారణ చేయించాలని కోరారు. నెల కిందటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభోత్సవం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టులోని కొండపోచమ్మ సాగర్‌ కాలువ కొట్టుకుపోవడం ప్రాజెక్టుల్లో నాణ్యత పాళ్లను తెలియజేస్తోందన్నారు. ఈఎన్‌సీపై చర్యలు తీసుకోవాలన్నారు. మేడిగడ్డ బ్యారేజ్‌ అంచనాలను రూ.నాలుగు వేల కోట్లకు పెంచారని, ఏ నిబంధనల మేరకు చెల్లించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. ఆరేళ్ల క్రితం ఏ టెండర్లలో పాల్గొనని గుత్తేదారులకు రూ.10 వేల కోట్ల పనులు అప్పగించారని అన్నారు. గత ప్రభుత్వాల పరిపాలనలో నీటిపారుదల శాఖ మంత్రి, సీఎం సంతకం అనంతరమే పనులకు అనుమతులు ఇచ్చేవారని ఇప్పుడు దిగువ స్థాయిలోనే అన్నీ పూర్తవుతున్నాయని తెలిపారు. ఏ చట్టం ప్రకారం నిబంధనలు మార్చారో తెలియజేయాలని కోరారు.
నీకిది నాకది విధానంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల  కొనుగోళ్లు: భట్టి
కాంగ్రెస్‌ నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలకు కాంట్రాక్టులు ఇచ్చి నీకిది నాకది విధానంలో కొనుగోలు చేశారని శాసనసభలో కాంగ్రెస్‌ పక్షనేత భట్టి విక్రమార్క అన్నారు. దీనికి ఉదాహరణే కొండపోచమ్మ సాగర్‌ పనులని తెలిపారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.