కాలువలో కూలిన కొండచరియ

ప్రధానాంశాలు

కాలువలో కూలిన కొండచరియ

పోలవరం సొరంగం నుంచి నీరు వచ్చే మార్గంలో..

తోటగొంది సమీపంలో కాలువలోకి జారిపోయిన కొండ చరియ

ఈనాడు డిజిటల్‌, ఏలూరు, పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మామిడిగొంది- తోటగొంది మధ్య సొరంగం నుంచి నీరు వెలుపలకు వచ్చే మార్గంలో కొండచరియ కాలువలోకి జారిపోయింది. కుడి కాలువకు నీరందించే సొరంగ మార్గంలో కొండ జారిపడటంతో అనుబంధ పనులకు అవాంతరమేర్పడిన విషయం తెలిసిందే. తోటగొంది గ్రామ సమీపంలోని సొరంగాలకు అర కిలోమీటరు దూరంలో కుడి వైపున కొండచరియ కూడా జారిపడినట్లు తాజాగా గుర్తించారు. కొండచరియ జారిపోయిన ప్రాంతంలో వెదర్‌రాక్‌ ఉందని, సొరంగం పనులతో పాటు దీన్ని కూడా సరిచేస్తామని అనుబంధ పనులను పర్యవేక్షిస్తున్న ఇన్‌ఛార్జి ఈఈ కె.బాలకృష్ణ తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని