close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సమాధానాలు చెప్పలేకే నిరవధిక వాయిదా

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ శాసనసభా పక్షం ధాటికి తట్టుకోలేక తెరాస ప్రభుత్వం సభను అర్ధాంతరంగా వాయిదా వేసి పారిపోయిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. కాంగ్రెస్‌ పక్షం అడిగే ప్రశ్నలకు సీఎం వద్ద కానీ, ప్రభుత్వం వద్ద సమాధానాలు లేవన్నారు. ప్రజా సమస్యలపై చర్చించే ధైర్యం లేదనడానికి నిరవధిక వాయిదా నిదర్శనమన్నారు. రాష్ట్రంపై రూ.6 లక్షల కోట్ల అప్పులు మోపడానికే సభను ఉపయోగించుకున్నారని ఆరోపించారు. అసెంబ్లీ నిరవధిక వాయిదా పడ్డ తర్వాత ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్కలతో కలిసి భట్టి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాన్ని తాకట్టుపెట్టి అప్పులు తెచ్చుకోవడం కోసం అవసరమయ్యే బిల్లులు పాస్‌ చేయించుకోవడానికి మాత్రమే సమావేశాలు నిర్వహించినట్లు ఉందన్నారు. కృష్ణా జలాలను ఏపీ రోజుకు 11 టీఎంసీలు తరలించుకుపోయేందుకు ప్రయత్నిస్తోందని, దీనిపై చర్చ జరిగితే కేసీఆర్‌ అసలు రూపం బయటకు వస్తుందనే ఇలా చేశారన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం, రైతుల ఇక్కట్లు, ఆరోగ్యం, పంచాయతీరాజ్‌ కార్యదర్శులు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న పేదలు.. ఇలా చర్చించాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయని వాటిపై చర్చించకుండానే అసెంబ్లీని నిరవధిక వాయిదా వేయడమేంటని ప్రశ్నించారు. హైదరాబాద్‌ అభివృద్ధికి వేల కోట్లు ఖర్చు చేసామంటున్న సర్కారు.. వాటితో చేసిన అభివృద్ధిని చూపించాలని డిమాండ్‌ చేశారు. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ..గురువారం నుంచి వర్చువల్‌గా శాసనసభ నిర్వహించాలని, ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘సీఎం, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు 8 రోజుల్లోని 31 గంటల్లో 24 గంటలు మాట్లాడారు. వారి మిత్రపక్షం ఎంఐఎంకు 3 గంటలు ఇచ్చారు. కానీ కాంగ్రెస్‌కు ఇచ్చిన 3 గంటల్లో మాత్రం అనేక సార్లు అడ్డు తగిలారు’ అని విమర్శించారు.

హైదరాబాద్‌ అభివృద్ధిలో సర్కారు విఫలం
ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ను గొప్పగా ఉంచడానికి అవసరమైన వ్యవస్థల్ని ఏర్పాటు చేయడంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని శాసనసభలో కాంగ్రెస్‌ సభాపక్ష నేత భట్టి విక్రమార్క విమర్శించారు. రాజధాని నగరం విశ్వనగరం అని చెప్పటానికే సర్కారు పరిమితమైందన్నారు. జీహెచ్‌ఎంసీ, దీని శివారు మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పన అంశంపై బుధవారం శాసనసభలో స్వల్పకాల చర్చ జరిగింది. ‘‘హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న బీహెచ్‌ఈఎల్‌, ఈసీఐఎల్‌, ఐడీపీఎల్‌, బీడీఎల్‌ వంటి సంస్థలన్నీ కాంగ్రెస్‌ హయాంలో ఏర్పాటయ్యాయి. తెరాస అధికారంలోకి వచ్చిన ఈ ఆరేళ్లలో హైదరాబాద్‌ చుట్టూ ఒక్కటైనా పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేశారా?’’ అంటూ విమర్శించారు. చిరు వ్యాపారులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న అందరికీ ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్స అందించేలా నిర్ణయం తీసుకోవాలని, ఉద్యోగ నోటిఫికేషన్‌లు జారీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.