close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సీఎం కేసీఆర్‌పై ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌ : దేశ ప్రధాని నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షులు కేసీఆర్‌పై రాష్ట్ర ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎన్నికల కమిషనర్‌ పార్థసారథిÅని శుక్రవారమిక్కడ భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి కలిసి లిఖితపూర్వక లేఖను అందించారు. ఈ నెల 18న గ్రేటర్‌ ఎన్నికల కోసం నిర్వహించిన సమావేశంలో ‘రైల్వేలో చాయ్‌వాలా.. ఇప్పుడు రైల్వేనే అమ్మేస్తున్నాడు’ అంటూ ప్రధాని స్థాయిని కించపరుస్తూ సీఎం కేసీఆర్‌ మాట్లాడారని ఆ లేఖలో పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమవుతోందని, రాజకీయాల కోసం భాజపా విద్వేషాలు రెచ్చగొడుతుందంటూ ఏ ఆధారం లేకుండానే సీఎం మాట్లాడటంపై ఆయన ఫిర్యాదు చేశారు. వీటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.