యువతకు ఉద్యోగాలు రాకుండా చేసింది భాజపా ప్రభుత్వమే: హరీశ్‌రావు
close

ప్రధానాంశాలు

యువతకు ఉద్యోగాలు రాకుండా చేసింది భాజపా ప్రభుత్వమే: హరీశ్‌రావు

చిన్నశంకరంపేట, న్యూస్‌టుడే : రాష్ట్రానికి నిధులివ్వకుండా, తెలంగాణ యువతకు ఉద్యోగాలు రాకుండా చేసింది భాజపా ప్రభుత్వమేనని మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు.రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు, జీఎస్టీ బకాయిలను కూడా కేంద్రం ఇవ్వడం లేదన్నారు. ట్రైబల్‌ యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో చెప్పినా కార్యరూపం దాల్చలేదన్నారు. శనివారం మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం కామారంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, తెదేపా ప్రభుత్వాల హయాంలో సక్రమంగా సాగు, తాగునీరు కూడా ఇవ్వలేదన్నారు.

రాష్ట్రంలో కలుస్తామంటున్నారు..
ఇటీవల తాను జహీరాబాద్‌ ప్రాంతంలోని మొగుడంపల్లికి వెళ్లానని, అక్కడి సరిహద్దులోని కర్ణాటక ప్రాంతవాసులు, ప్రజాప్రతినిధులు కొందరు తనను కలిశారని, తాము తెలంగాణలో కలవడానికి వేచి ఉన్నట్లుగా రాసిచ్చారని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో పలు వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని, కర్ణాటకలో భాజపా ప్రభుత్వం ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. రైతుబంధు సాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని, త్వరలోనే పూర్తిస్థాయి రుణమాఫీ వర్తింపజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని