
ప్రధానాంశాలు
అలా అయితే నన్ను క్షమించండి..
ఉత్తరాది వ్యూహకర్త సలహాలతోనే వైకాపా దుష్ప్రచారం
భోగి వేడుకల్లో చంద్రబాబు భావోద్వేగం
‘నేనేం తప్పు చేశానో నాకు తెలియదు. నన్ను క్షమించండి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తప్పా. వైకాపా నాయకుల నాటకాలు నమ్మి ప్రజలు పూనకం వచ్చినట్లు ఓట్లేశారు’.
- పరిటాలలో భోగి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలివి.
ఈనాడు, అమరావతి, నందిగామ, న్యూస్‌టుడే: ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని తెలిసే.. స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఏపీ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఇటీవల ఉత్తరాది నుంచి వచ్చిన ఓ పగటి వేషగాడు ఇచ్చిన సూచన మేరకు తమపై అసత్య ప్రచార దాడిని వైకాపా నేతలు, ప్రభుత్వ పెద్దలు ప్రారంభించారని ఆరోపించారు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్ అన్ని విధాలుగా దోచుకుంటున్నారని ఆరోపించారు. మరుగుదొడ్లపై పన్నులు వేస్తున్న గాలిరెడ్డి.. మనం పీల్చే గాలిపైనా పన్ను వేసినా ఆశ్చర్యపోనవసరం లేదని ఎద్దేవా చేశారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో తెదేపా ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజామున నిర్వహించిన భోగి వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ‘సీఎం మాములు వ్యక్తి కాదు. ఓ అపరిచితుడు.. విచిత్రమైన వ్యక్తి.. అలాంటి వారిని ఎక్కడా చూసి ఉండం.. మోసం, దగా చేస్తూ సానుభూతి కోసం నాటకాలకు తెరతీస్తారు’ అని ఆరోపించారు. 18 నెలల్లో ఏడుసార్లు తుపాన్లు వస్తే నష్ట పరిహారం చెల్లించని రైతు వ్యతిరేకి సీఎం జగన్ అని, బీమా పథకానికి స్వస్తి పలికారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించే బీమా ప్రీమియం చెల్లించలేదని అసెంబ్లీలో నిలదీస్తే రాత్రికి రాత్రి జీవో ఇచ్చారని గుర్తు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటలకే పరిటాల చేరుకున్న మహిళలు, తెదేపా కార్యకర్తలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పలు జీవోలను భోగి మంటల్లో వేసి దహనం చేశారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించండి: హైకోర్టు
- 2-1 కాదు 2-0!
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- కొలిక్కి వచ్చిన దుర్గగుడి వెండి సింహాల కేసు
- రిషభ్ పంత్ కాదు.. స్పైడర్ పంత్: ఐసీసీ
- ఈసారి అత్యధిక ధర పలికే ఆటగాడితడే!
- శంషాబాద్‌లో సిరాజ్‌కు ఘన స్వాగతం..
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- ఇంకా నయం.. వారినీ తీసేస్తారనుకున్నా: గంభీర్
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!