
ప్రధానాంశాలు
జనగామ లాఠీఛార్జి ఘటనపై బండి సంజయ్
జనగామ టౌన్, న్యూస్‌టుడే: జనగామలో మంగళవారం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న భాజపా పట్టణ అధ్యక్షుడు పవన్శర్మతో పాటు మరో నలుగురు కార్యకర్తలపై అమానుషంగా లాఠీఛార్జి చేసిన జనగామ సీఐ మల్లేష్, ఎస్సై శ్రీనివాస్‌లను వెంటనే సస్పెండ్ చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల్లో స్పందించకుంటే తామేంటో చూపిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. లాఠీఛార్జిలో గాయపడి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పవన్‌శర్మ, ఇతర కార్యకర్తలను బుధవారం ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరులతో సంజయ్ మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా తమ పార్టీ శ్రేణులు ఆయన ఫొటోలున్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తమ సిబ్బందితో తొలగించారన్నారు. ఈ విషయాన్ని మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లి అడిగిన పవన్‌శర్మ తదితరులకు కమిషనర్ సమాధానం చెప్పలేదన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ కార్యకర్తలను సీఐ మల్లేష్, ఎస్సై శ్రీనివాస్ చితకబాదారన్నారు. వారిద్దరినీ సస్పెండ్ చేయాలని, అకారణంగా ఫిర్యాదు చేసిన మున్సిపల్ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. నల్లగొండలోనూ భాజపా కార్యకర్తలపై నాన్‌బెయిల్ కేసులు పెట్టారన్నారు. అంతకుముందు సంజయ్ జనగామ ఆర్టీసీ చౌరస్తా నుంచి పార్టీ శ్రేణులతో కలసి ర్యాలీగా జిల్లా ఆసుపత్రికి తరలివచ్చారు. ఒకదశలో ప్రధాన రహదారి పక్కన ఉన్న వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయంలోకి పార్టీ శ్రేణులు దూసుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు నిలువరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి విజయరామారావు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, నాయకులు రావు పద్మ, దశమంతరెడ్డి, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.
లాఠీఛార్జిపై విచారణకు ఆదేశం
వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: జనగామలో మంగళవారం భాజపా నాయకులపై లాఠీఛార్జి ఘటనకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ నిర్వహించాలని వెస్ట్‌జోన్ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డిని వరంగల్ సీపీ పి.ప్రమోద్‌కుమార్ ఆదేశించారు. పోలీసులు బాధ్యులుగా తేలితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించండి: హైకోర్టు
- 2-1 కాదు 2-0!
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- కొలిక్కి వచ్చిన దుర్గగుడి వెండి సింహాల కేసు
- రిషభ్ పంత్ కాదు.. స్పైడర్ పంత్: ఐసీసీ
- ఈసారి అత్యధిక ధర పలికే ఆటగాడితడే!
- శంషాబాద్‌లో సిరాజ్‌కు ఘన స్వాగతం..
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- ఇంకా నయం.. వారినీ తీసేస్తారనుకున్నా: గంభీర్
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!