
ప్రధానాంశాలు
సీఎంగా కేటీఆర్‌ను చేస్తే ప్రజలు అంగీకరిస్తారా?
భాజపా రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు
ఈనాడు, హైదరాబాద్- సుబేదారి (వరంగల్), న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ పదవి నుంచి తప్పుకుని.. కేటీఆర్‌ను సీఎంను చేయాలనుకునే పక్షంలో ప్రజాతీర్పు కోరాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెరాసలో ఉద్యమకారులైన ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారని, వారిలో లేని ప్రత్యేకత కేటీఆర్‌లో ఏముందని ప్రశ్నించారు. అగ్రవర్ణ సామాజిక వర్గాల సంఘాల నేతలు సంజయ్‌ను భాజపా రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం సన్మానించారు. ఈ సందర్భంగా, హన్మకొండలోనూ ఆయన విలేకరులతో మాట్లాడారు. కేటీఆర్‌ను సీఎంను చేస్తే మంత్రివర్గం ఏర్పాటయ్యాక తెరాసలో అణుబాంబు పేలుతుందని అన్నారు. కొడుకుని ముఖ్యమంత్రిని చేయడం కోసం కేసీఆర్ ఇటీవల తన వ్యవసాయక్షేత్రంలో దోషనివారణ పూజలు చేసి ఆ పూజాసామగ్రిని త్రివేణి సంగమంలో కలిపేందుకే కాళేశ్వరం వెళ్లి వచ్చారని ఆరోపించారు. ‘‘నిన్ను ముఖ్యమంత్రిగా గుర్తించి ప్రజలు మళ్లీ నీ పార్టీని గెలిపించారు. నిర్వహించే సమర్థత లేక ఆ పదవి నుంచి దిగిపోతే మళ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలి. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి.. ఏపార్టీ నుంచి అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. సీఎంగా నీ కొడుకుని ప్రజలు అంగీకరిస్తారా? దళితుణ్ని సీఎంను చేస్తానన్న హామీ ఏమైంది?’ అని సంజయ్ ప్రశ్నించారు. ‘తెలంగాణకు పెద్ద దోషం ముఖ్యమంత్రే. రాష్ట్ర ప్రజలు ఇందుకు దోషనివారణ చేయాలి. నటనలో కేసీఆర్‌ని మించినవారు లేరు. ఆయన్ను పెడితే 20 గంటల్లోనే షూటింగ్ పూర్తవుతుంది. ఖర్చు తక్కువ, ప్రేక్షకులు ఎక్కువ. స్టాఫ్ నర్సులపై పోలీసులు లాఠీఛార్జి చేయడం తగదు. వారితో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలి’’ అని సంజయ్ డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రెండేళ్లు ఆలస్యం చేసినందుకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు. కార్యక్రమంలో ప్రేమేందర్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ డైరీ, క్యాలెండర్‌ను సంజయ్ ఆవిష్కరించారు.
రామ మందిరానికి జితేందర్‌రెడ్డి రూ.కోటి విరాళం
ఈనాడు, హైదరాబాద్: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ, భాజపా నేత జితేందర్‌రెడ్డి రూ.కోటి విరాళం ఇచ్చారు. గ్రీన్‌పార్క్ హోటల్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యదర్శి భయ్యాజి జోషికి అందించారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- పిచ్చి..పిచ్చి రాతలు రాయకండి: అషూరెడ్డి
- నాలుగో అంతస్తు నుంచి పడి ముత్తూట్ ఛైర్మన్ మృతి
- బుమ్రాతో పెళ్లిపై అనుపమ కుటుంబ సభ్యుల క్లారిటీ
- వాళ్లను కొట్టి.. వాళ్లింటికి
- అంబానీ గ్యారేజ్‌లో చేరిన కొత్త కారిదే..!
- ఫొటోలో చూసినట్లు వరుడు లేడని పెళ్లికి నిరాకరణ
- ఆర్ఆర్ఆర్కు మార్గం సుగమం
- వారసత్వం వదిలి వెళ్లాలనే: యాష్
- సన్నబడతారంటూ స్కీం... రూ.1,500 కోట్ల స్కాం
- ఆ సినిమా ఫ్లాప్..నితిన్‌కి ముందే తెలుసు