
ప్రధానాంశాలు
ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ
ఈనాడు డిజిటల్, చెన్నై: తమిళనాడు సంస్కృతిని ప్రధాని నరేంద్ర మోదీ అగౌరవపరిచారని, కేంద్రం తమిళ భాషను, చరిత్రను లేకుండా చేయాలని చూస్తోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. అలాంటి చర్యలను కచ్చితంగా అడ్డుకుంటామన్నారు. తమిళనాడు శాసనసభకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మూడురోజుల ఎన్నికల పర్యటనను ఆయన శనివారం కోయంబత్తూరులో ప్రారంభించారు. అవినాశి రోడ్డులో ప్రచార వాహనంపై నుంచి మాట్లాడారు. దేశంలో ఒకే సంస్కృతి, ఒకే భాష ఉండాలని ప్రధాని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. తమిళనాట ఉన్న ప్రత్యేక సంస్కృతిని భాజపా బారి నుంచి కాంగ్రెస్ కాపాడుతుందన్నారు. బడా వ్యాపారవేత్తలతో మోదీ భాగస్వామ్యం కుదుర్చుకుని.. దేశ ప్రజలకు సొంతమైన వాటిని ఒక్కొక్కటిగా అమ్ముతున్నారని ఆరోపించారు. మూడు వ్యవసాయ చట్టాల ద్వారా రైతుల హక్కులు హరించాలని మోదీ ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. రైతులను బడా పారిశ్రామికవేత్తలకు సేవకులుగా మార్చాలని భావిస్తున్నారని ఆరోపించారు.
అధికారంలోకి వస్తే ఒకే పన్ను.. కనీస పన్ను
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జీఎస్టీపై పునఃసమీక్ష జరిపి ప్రక్షాళన చేస్తామని, ఒకే పన్ను- కనీస పన్ను తీసుకువస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. తిరుప్పూర్ జిల్లాలో పరిశ్రమల ప్రతినిధులతో మాట్లాడుతూ.. ప్రస్తుత పన్ను విధానం చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)ను నిర్వీర్యం చేసేలా ఉన్నాయని తెలిపారు. చైనా, బంగ్లాదేశ్ వంటి దేశాలతో పోటీపడేలా ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- ఈమె పాక్ ‘ఐష్’!
- యూట్యూబ్ ఫేమ్ షణ్ముఖ్‌పై కేసు నమోదు
- నా మాజీ ప్రియుడు ఇంకా అక్కడే ఉండిపోయాడు
- శ్రద్ధా జిగేల్.. సుమ ఆట.. క్రిష్ ఫిదా..!
- అమెరికా అప్పెంతో తెలుసా?
- ఐసీసీ ఆగ్రహానికి గురికాకుండా పిచ్‌లో మార్పులు!
- 25కి.మీ. రోడ్డు.. 18 గంటల్లో పూర్తి..!
- గూగుల్‌లో వీటిని వెతకడం ప్రమాదం!
- అలా కనిపించడానికి కష్టపడ్డా
- రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య