close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అన్నదాతలను కాపాడుకుంటాం: భట్టి

ముగిసిన ‘రైతు పొలంబాట- పోరుబాట’

కొణిజర్ల, న్యూస్‌టుడే: దేశానికి వెన్నెముక అయిన అన్నదాతలను కాపాడుకోవడంలో కాంగ్రెస్‌ ముందుంటుందని.. యాత్రలో తన దృష్టికి వచ్చిన సమస్యలను శాసనసభలో వినిపించి ప్రభుత్వాన్ని నిలదీస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ‘రైతు పొలంబాట- పోరుబాట’ ముగింపు సభను ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పెద్దగోపతిలో సోమవారం రాత్రి నిర్వహించారు. భట్టి మాట్లాడుతూ చర్చల ద్వారానే నల్లచట్టాల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని పేర్కొన్నారు. కేంద్రం పాములా కరవడానికి వస్తోందని.. దాన్ని కర్రతో కొట్టాలని, రాష్ట్రం తేలులా విషం చిమ్మడానికి వస్తోందని దాన్ని నలిపివేసి రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ మధుయాస్కీ, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య పాల్గొన్నారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు