
ప్రధానాంశాలు
ఈనాడు, హైదరాబాద్: మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికకు నామినేషన్లు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. ఫిబ్రవరి 16 నుంచి సోమవారం వరకు మొత్తం 59 అభ్యర్థుల నుంచి 90 నామపత్రాలు దాఖలయ్యాయి. సోమవారం ఏడో రోజున అత్యధికంగా 26 మంది అభ్యర్థులు 47 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రియాంకకు అందజేశారు. తెరాస తరఫున ఎస్.వాణీదేవి నామినేషన్ దాఖలు చేయగా, భాజపా నుంచి రాంచందర్‌రావు నాలుగు సెట్లు, కాంగ్రెస్ నుంచి జి.చిన్నారెడ్డి, ఎంఐఎం నుంచి నూర్జహాన్‌బేగం, దళిత బహుజన పార్టీ నుంచి ప్రీతి స్వర్ణలత, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున శ్రీకృష్ణ పబ్బతి, బహుజన్ ముక్తి పార్టీ నుంచి ఎ.లక్ష్మణ్, నామపత్రాలు సమర్పించారు. స్వతంత్రులుగా 31 మంది నామినేషన్లు వేశారు.
28 మంది అభ్యర్థులు.. 33 నామినేషన్లు
నల్గొండ కలెక్టరేట్, న్యూస్‌టుడే: వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు సోమవారం 28 మంది అభ్యర్థులు 33 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. భాజపా నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, తెలంగాణ జనసమితి నుంచి ఆచార్య కోదండరాం, కాంగ్రెస్ అభ్యర్థి సబావత్ రాములు నాయక్ తరఫున ఒక సెట్, యువ తెలంగాణ పార్టీ నుంచి గోగుల రాణీరుద్రమ, తెలంగాణ ఇంటి పార్టీ నుంచి చెరుకు సుధాకర్, స్వతంత్ర అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న తదితరులు నామినేషన్లు వేశారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- ఏంటీ ఇవన్నీ రీమేక్‌లా..!
- నాపై నాకే చిరాకేసింది: బెన్‌స్టోక్స్
- పెళ్లి కుదిరాక నిరాకరించాడని!
- అర్ధరాత్రి ఆకలేస్తోందా...
- నెలకు రూ.8వేలు రావాలంటే...
- ప్రభాస్‌తో ఫరియా.. పాయల్ తెలుగు.. శ్రీముఖి సెల్ఫీ
- మనసుకు నచ్చినవాడిని మనువాడి...
- అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్
- క్యాస్టింగ్ కౌచ్‌ని ఎదిరించి.. సినిమాల్లో రాణించి..!
- రివ్యూ: ఏ1 ఎక్స్‌ప్రెస్