close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదు

తెదేపా అధినేత చంద్రబాబు వెల్లడి

ఈనాడు, అమరావతి: ఏపీలో పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగలేదని, రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వీర్యమై, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయిందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ ఎన్నికలతో వైకాపా పతనం ప్రారంభమైందన్నారు. ఈ ఎన్నికలు నాంది మాత్రమేనని, వైకాపా నాయకులు తలకిందులుగా తపస్సు చేసినా, దేవుడిని ప్రార్థించినా సర్వశక్తులూ ఒడ్డినా వైకాపా పతనాన్ని ఆపలేరని పేర్కొన్నారు.  పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు, తెదేపా కార్యకర్తలు వీరోచితంగా పోరాడారని కొనియాడారు. నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో తెదేపా మద్దతుదారులు 1,105 చోట్ల గెలిచారని, పొత్తులతో కలిపి మొత్తం 1,136 స్థానాల్ని తెదేపా గెలుచుకుందని సోమవారం తెదేపా కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో చంద్రబాబు తెలిపారు. ఎన్నికలు సక్రమంగా జరిగితే తెదేపాకి మరో 10 శాతం స్థానాలు పెరిగేవన్నారు. మొత్తంగా నాలుగు విడతల్లో తెదేపా మద్దతుదారులు 4,230 స్థానాల్లో గెలిచారన్నారు. 2013 ఎన్నికలకీ ఇప్పటికీ ఆరు శాతం ఓటింగ్‌ తగ్గిందని, అది కూడా వస్తే వైకాపా పనైపోయేదని ఆయన తెలిపారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు