
ప్రధానాంశాలు
మేధావులకు బండి సంజయ్ పిలుపు
ఈనాడు నల్గొండ: ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగుల అభీష్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న తెరాస సర్కారుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావులు ఓటుతో గుణపాఠం చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. భాజపా అభ్యర్థిని గెలిపిస్తేనే ప్రభుత్వం దిగివచ్చి.. పీఆర్సీ, నిరుద్యోగ భృతి, నియామకాల ప్రకటన లాంటి పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తుందన్నారు. నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానానికి పార్టీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి నామినేషన్ సందర్భంగా నల్గొండలో సోమవారం నిర్వహించిన సభలో సంజయ్ మాట్లాడారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఏనాడు పీఆర్సీ, నిరుదోగ్య భృతి గురించి మాట్లాడలేదన్నారు. ప్రభుత్వాన్ని నిలదీసే భాజపా అభ్యర్థికి ఓటేయాలి తప్పితే, ప్రగతి భవన్‌కు గులాంగిరీ చేసే వ్యక్తికి కాదని చెప్పారు. రెండు, మూడు రోజుల్లో పల్లా స్కాం మొత్తం బయటపెడతానని హెచ్చరించారు. రాష్ట్రంలో 2023లో వచ్చేది భాజపా ప్రభుత్వమేనని.. అప్పుడు ఉద్యోగులు కోరినంత పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, విజయరామారావు, నేతలు యెండల లక్ష్మీనారాయణ, వివేక్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భాజపా గెలుపు ఖాయం: కిషన్‌రెడ్డి
బర్కత్‌పుర, న్యూస్‌టుడే: శాసనమండలి ఎన్నికల్లో భాజపా విజయం సాధించడం ఖాయమని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల స్థానం భాజపా అభ్యర్థి ఎన్.రాంచందర్‌రావు నామినేషన్ ర్యాలీని సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన కిషన్‌రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో సీనియర్ నేతలు మురళీధర్‌రావు, ఇంద్రసేనారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- మూడేళ్ల బాలుడిపై పిన్ని పైశాచికత్వం
- రూ. 47వేలకు చేరిన బంగారం
- సామ్ ఛాలెంజ్.. ప్రగతి డ్యాన్స్.. రకుల్ విషెస్
- #RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
- ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
- హెచ్-1బి వీసాలపై తేలని స్పష్టత
- ఆ 2 గ్రామాలు ఆ దేశాలను ప్రతిబింబిస్తాయ్!
- టీకా వేయించుకున్న నటాషా పూనావాలా
- ఆ రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టిక్కెట్ ధర ₹50
- రూ.10లక్షల బడ్జెట్లో మంచి మైలేజ్ ఇచ్చే కార్లు