
ప్రధానాంశాలు
వారికి భయపడే పెట్టుబడులు రావడం లేదు
ఎన్నికల సభలో మమతపై ప్రధాని ధ్వజం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఈసారి భాజపా అధికారంలోకి రావడం ఖాయమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తంచేశారు. ప్రజలు మార్పునకు సిద్ధంగా ఉన్నారని, బెంగాల్లో అసలైన పరివర్తన భాజపా తీసుకొస్తుందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బెంగాల్, అసోంలో సోమవారం పర్యటించిన ప్రధాని హుగ్లీలో బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా అధికార తృణమూల్ నేతలపై ప్రధాని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేతల కారణంగానే బెంగాల్‌కు పెట్టుబడులు రావడం లేదని అన్నారు. ‘‘ఇల్లు అద్దెకిచ్చిన వారి దగ్గరా డబ్బులు వసూలు చేస్తున్నారు. అద్దెకు తీసుకున్న వారి దగ్గరా వసూలు చేస్తున్నారు. రెండు వైపులా సంపాదిస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి. అప్పుడే బెంగాల్ అభివృద్ధి చెందుతుంది’’ అని అన్నారు. ఈ నేతలను చూసే ప్రవాస బెంగాల్ వాసులు కూడా పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నారని అన్నారు. ఇది మారాలంటే బెంగాల్లో కమలం వికాసం తప్పనిసరి అని పేర్కొన్నారు. ‘బెంగాల్‌కు తన సొంత కూతురే కావాలి’ అంటూ తృణమూల్ లేవనెత్తిన తాజా నినాదాన్ని మోదీ తప్పు పట్టారు. తాగడానికి నీళ్లు కావాలని అర్థిస్తున్న బెంగాల్ ఆడబిడ్డలపై రాష్ట్ర ప్రభుత్వం కనీసం కనికరం చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జల్ జీవన్ మిషన్‌లో భాగంగా ఇంటింటికీ నీళ్లు అందించేందుకు రాష్ట్రానికి కేంద్రం రూ.1700 కోట్లు కేటాయిస్తే అందులో 609 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిందని ప్రధాని తెలిపారు. అంతకుముందు ప్రధాని.. నోవాపాడా నుంచి దక్షిణేశ్వర్ వరకు మెట్రోరైలును ప్రారంభించారు.
అసోంపై గత ప్రభుత్వాలవి సవతి ప్రేమ
గువాహటి, ఈనాడు: అసోంపై గత ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమను చూపించాయని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. సోమవారం అసోంలోని ధెమాజీ జిల్లా శిలాపథర్లో మూడు గ్యాస్, పెట్రోలియం పథకాలను మోదీ జాతికి అంకితం చేశారు. ధెమాజీ ఇంజినీరింగ్ కళాశాలను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అసోం ఎన్నికల షెడ్యూల్ మార్చి మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆలోపు తాను ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో వీలైనన్ని ఎక్కువసార్లు పర్యటిస్తానని వెల్లడించారు.
రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తాం
దిల్లీ: రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచ యుద్ధాల సమయంలో ప్రపంచానికి భారత్ కర్మాగారాల నుంచే ఆయుధాలు ఎగుమతి అయ్యేవని.. తర్వాత ప్రభుత్వాలు దీన్ని నిర్లక్ష్యం చేశాయని చెప్పారు. పలితంగా చిన్న చిన్న ఆయుధాలకూ ఎగుమతులపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఈపరిస్థితిని తమ ప్రభుత్వం మార్చే దిశగా ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ దిశగా దేశం అడుగులు వేస్తోందని చెప్పారు. ఇందుకు ప్రైవేటు రంగం కూడా తమతో కలసిరావాలని మోదీ విజ్ఞప్తి చేశారు. సోమవారం రక్షణరంగానికి కేటాయించిన బడ్జెట్‌పై జరిగిన ఓ వెబినార్‌లో ప్రధాని ప్రసంగించారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- మూడేళ్ల బాలుడిపై పిన్ని పైశాచికత్వం
- రూ. 47వేలకు చేరిన బంగారం
- సామ్ ఛాలెంజ్.. ప్రగతి డ్యాన్స్.. రకుల్ విషెస్
- #RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
- ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
- ఆ 2 గ్రామాలు ఆ దేశాలను ప్రతిబింబిస్తాయ్!
- హెచ్-1బి వీసాలపై తేలని స్పష్టత
- టీకా వేయించుకున్న నటాషా పూనావాలా
- ఇలియానా నయా బాయ్‌ఫ్రెండ్‌ని చూశారా..!
- ఆ రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టిక్కెట్ ధర ₹50