close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కుమురం భీం స్ఫూర్తితో తెరాసపై పోరు

భాజపా రాష్ట్ర ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్‌

ఈనాడు డిజిటల్‌, ఆసిఫాబాద్‌: భాజపా ధాటికి తెరాస కొట్టుకుపోతుందని జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్‌ అన్నారు. కుమురం భీం పోరాట స్ఫూర్తితో తెరాస ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో మంగళవారం నిర్వహించిన ‘ఛత్రపతి శివాజీ సంకల్ప సభ’లో ఆయన మాట్లాడారు. కేంద్రం 80 కోట్ల మందికి రేషన్‌, 10 కోట్ల మందికి మరుగుదొడ్లు, 40 కోట్ల మందికి బ్యాంకింగ్‌ సేవలు సమకూర్చిందన్నారు. కేసీఆర్‌ అరాచక పాలనను ఇక ఎంతమాత్రం సహించేది లేదన్నారు.

లక్షల ఉద్యోగాలిచ్చామని నిరూపిస్తే తెరాసకు ప్రచారం: సంజయ్‌

తెలంగాణలో 13 వేల పరిశ్రమలను స్థాపించి, అయిదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని సీఎం నిరూపిస్తే రాబోయే ఎన్నికల్లో తెరాసకే ఓటు వేయాలని ప్రచారం చేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు. ఓడిపోయే స్థానంలో పీవీ కుమార్తెను ఎమ్మెల్సీగా నిలబెట్టి ఆయన గౌరవాన్ని సీఎం కేసీఆర్‌ తగ్గిస్తున్నారన్నారు. కమీషన్‌ రాలేదనే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును పక్కన పెట్టారని పేర్కొన్నారు. న్యాయవాద దంపతుల హత్యలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. పాల్వాయి హరీశ్‌బాబు భాజపాలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభలో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దిలీప్‌, ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎంపీ వివేక్‌, భాజపా జిల్లా అధ్యక్షుడు పౌడెల్‌ తదితరులు పాల్గొన్నారు.

భాజపా పదాధికారుల భేటీ నేడు

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా రాష్ట్ర పదాధికారుల సమావేశం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం సాయంత్రం జరగనుంది. హైదరాబాద్‌, నల్గొండ పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కమలదళం చర్చించనుంది. ఈ భేటీకి ముందు పార్టీ రాష్ట్ర కీలక నేతలు ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు సమాచారం. భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్‌చుగ్‌, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు ఇతర నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. తర్వాత పదాధికారుల సమావేశం ప్రారంభం అవుతుంది. గురువారం తరుణ్‌చుగ్‌ నాగార్జునసాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్లనున్నారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు