
ప్రధానాంశాలు
తిరువనంతపురం/దిల్లీ: దేశంలో ఉత్తరాదిన రాజకీయాలు విభిన్నంగా ఉంటాయని.. కేరళకు వచ్చేసరికి తనకు అంతా ఉత్సాహంగా ఉంటుందని కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ మంగళవారం వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ భాజపా నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేరళలో ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితాల నేతృత్వంలో కాంగ్రెస్ చేపట్టిన ‘ఐశ్వర్య యాత్ర’ ముగింపు సభ సందర్భంగా తిరువనంతపురంలో రాహుల్ మాట్లాడారు. తాను తొలి 15 ఏళ్లు ఉత్తరాదిన ఎంపీగా ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఉత్తరాదిన భిన్న రాజకీయాలుంటాయని, కేరళలో కొత్తగా అనిపిస్తుందని అన్నారు. ఇక్కడి ప్రజలు సమస్యలపై పూర్తి ఆసక్తి, అవగాహనతో ఉంటారన్నారు. ఇటీవల అమెరికాలో విద్యార్థులతో మాట్లాడినప్పుడు కూడా కేరళకు వెళుతుండటం తనకు ఉత్సాహంగా ఉంటుందని చెప్పినట్లు రాహుల్ గుర్తుచేశారు. కేరళలో చేపట్టిన యాత్ర ద్వారా రైతులు, విద్యార్థులు, మత్స్యకారులు, మహిళలు, వయోధికుల సమస్యల వినే అవకాశం దక్కిందన్నారు.ప్రజల వాణిని వినేందుకే తాను వచ్చినట్లు చెప్పారు. కేరళలో జనవరి 31 నుంచి కాంగ్రెస్ ఈ యాత్రను ప్రారంభించింది.
రాహుల్‌ది అవకాశవాదం: భాజపా
కేరళలో రాహుల్ వ్యాఖ్యలను భాజపా నేతలు తీవ్రంగా విమర్శించారు. ఆయన అవకాశవాదంతో వ్యవహరిస్తున్నారని.. పలు ఎన్నికల్లో అమేఠీ నుంచి గెలుపొందిన రాహుల్ ఉత్తరాది ప్రజలను కించపరుస్తున్నారని ట్విటర్ వేదికగా ఆరోపించారు. ‘‘రాహుల్ కొద్ది రోజుల క్రితం ఈశాన్య ప్రాంతానికి వెళ్లినప్పుడు దేశ పశ్చిమ ప్రాంతంపై విషం చిమ్మారు. ఇప్పుడు దక్షిణాదికి వెళ్లి ఉత్తరాదిపై అదే చేస్తున్నారు. విభజించి పాలించే రాజకీయాలను ప్రజలు తిరస్కరిస్తారు’’ అని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. ఉత్తరాది ప్రజలను, అమేఠీని కించపరచవద్దని, రాహుల్‌కు కృతజ్ఞత లేదని కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, కిరణ్ రిజిజులు ధ్వజమెత్తారు. ‘‘భారత్ ఒకటే దేశం. మనల్ని విభజించొద్దు’’ అని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, గజేంద్రసింగ్ షెకావత్‌లు కూడా ఈ విషయమై రాహుల్‌పై పలు విమర్శలు చేశారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- 40 రోజులు.. రూ.40 లక్షల అద్దె!
- అమెరికా అప్పెంతో తెలుసా?
- గ్లామర్ ఫొటోలతో ఫిదా చేస్తోన్న తారలు
- అమ్మా.. నాన్న.. అన్న... అన్నీ ఆమె!
- ఇలాంటి వారివల్లే కరోనా కేసులు పెరిగేది!
- వనస్థలిపురంలో కారు బీభత్సం
- కిమ్ ఆంక్షలు.. రష్యా దౌత్యవేత్తల తిప్పలు
- థ్యాంక్స్ చెప్పిన జెస్సీ.. ఉల్లి తరిగిన ఊర్వశి
- టీమ్ఇండియా ఇలా చేయదు కదా..!
- మే 2న.. నేను చెప్పిందే నిజమవుతుంది: పీకే