close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ట్రంప్‌నకు మించిన పరాభవం

 ప్రధానిపై మమత తీవ్ర వ్యాఖ్యలు
 అతిపెద్ద  అల్లర్ల సృష్టికర్తగా విమర్శ

సహగంజ్‌: ప్రధాని నరేంద్ర మోదీపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) అధినాయకురాలు బుధవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోదీని ‘అతిపెద్ద అల్లర్ల సృష్టికర్త’గా ఆరోపించారు. అమెరికాలో డొనాల్డ్‌ ట్రంప్‌నకు మించిన పరాభవం మోదీకి తప్పదని వ్యాఖ్యానించారు. గతవారం ప్రధాని మోదీ ప్రసంగించిన చోటైన హుగ్లీ జిల్లా సహగంజ్‌లోనే మమత బహిరంగసభ నిర్వహించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాలు అసత్యాలను ప్రచారం చేస్తూ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. టీఎంసీ కమీషన్లు (కట్‌ మనీ) తీసుకుంటుందని భాజపా నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ ఆమె మాట్లాడారు. ‘‘ఆయన టీఎంసీని దోచుకునే పార్టీ అంటున్నారు. మరి ఆయనేంటి? మోదీ అతిపెద్ద అల్లర్ల సృష్టికర్త, అవకాశవాది. మీరు కోట్ల రూపాయలకు యావత్తు దేశాన్ని అమ్ముకుంటున్నారు. దాన్ని ఏమంటారు? క్యాట్‌ మనీ లేదా ర్యాట్‌ మనీ’’ అని మమత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ మరోసారి అధికారంలోకి వస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ‘‘ట్రంప్‌ కోసం మోదీ అమెరికా వెళ్లారు. ఎన్నికల్లో ట్రంప్‌నకు ఏమైందో అందరికీ తెలుసు. మోదీ పరిస్థితి అంతకంటే అధ్వానంగా ఉంటుంది’’ అని మమత దుయ్యబట్టారు. టీఎంసీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ భార్యను ఇటీవల సీబీఐ విచారించడాన్ని మమత ఖండించారు. ఇది తమ మహిళలను అవమానించడమేనని వ్యాఖ్యానించారు. ‘‘మీరు చేసే తప్పుడు పనులను నిలదీస్తున్నానని నాకు మీరు వ్యతిరేకంగా ఉండొచ్చు. నన్ను చంపండి లేదా మీకు నచ్చినట్లు చేసుకోండి. కానీ ఒక 22-23 ఏళ్ల గృహిణిని బొగ్గు దొంగని ఆరోపిస్తారా? ఇది సిగ్గుచేటు’’ అని విమర్శించారు. సభ ప్రారంభంలో క్రికెటర్‌ మనోజ్‌ తివారీ, బెంగాలీ నటులు కాంచన్‌ మల్లిక్‌, సయానీ ఘోష్‌ తదితరులతో పాటు పశ్చిమబెంగాల్‌ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ అనన్య చక్రవర్తి ఛటర్జీ టీఎంసీలో చేరారు.
టీకాల కోసం ప్రధానికి లేఖ
బెంగాల్‌ ప్రజల కోసం అసెంబ్లీ ఎన్నికలకు ముందే కరోనా టీకా పంపిణీ చేయాలని కేంద్రానికి మమత విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆమె లేఖ రాశారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు