
ప్రధానాంశాలు
కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్
కవాడిగూడ, న్యూస్‌టుడే: విద్యావంతుల వివేకంతోనే దేశవికాసం ముడిపడి ఉందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు. ఎమ్మెల్సీగా రాంచందర్‌రావు మండలిలో చేసిన ప్రసంగాల పుస్తకాన్ని ఆయన శనివారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. అనంతరం ‘ఆత్మనిర్భర్ భారత్ - పట్టభద్రుల పాత్ర’ అంశంపై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కరోనా కష్టకాలంలో 80 కోట్ల మందికి 8 నెలల పాటు ఉచితంగా బియ్యం ఇచ్చిందని, జన్‌ధన్ ఖాతాల్లో డబ్బులు వేసిందని గుర్తుచేశారు. ప్రజలకు ఉచితంగా కరోనా వాక్సిన్ ఇస్తోందన్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు త్వరలో తగ్గుముఖం పడతాయని చెప్పారు. త్వరలో ఎన్నికలు జరుగనున్న పలు రాష్ట్రాల్లో భాజపా విజయకేతనం ఎగురవేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎన్నికల్లో విద్యావంతుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. కుటుంబ పార్టీలను పారదోలాలన్నారు. రాంచందర్‌రావు మాట్లాడుతూ శాసనమండలి సభ్యుడిగా ఏం చేశానో సోమవారం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ వద్ద చెబుతానని, అక్కడికి రావాలని మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు. ఏపీ విశ్రాంత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సభకు అధ్యక్షత వహించగా.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనుమడు ఎన్వీ సుభాష్, భాజపా నేతలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మోత్కుపల్లి నర్సింహులు, వివేక్ వెంకట్‌స్వామి, కపిలవాయి దిలీప్‌కుమార్, గీతామూర్తి, మాధవీలత తదితరులు పాల్గొన్నారు.
టికెట్ ఎవరికిచ్చినా కలిసి పనిచేయాలి
- సాగర్’ నేతలతో బండి సంజయ్
ఈనాడు, హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి ఎవరన్నది కమిటీ ద్వారా నిర్ణయిస్తామని, ఆశావహులు విడివిడిగా కాకుండా సమష్టిగా పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశించారు. ఆ నియోజకవర్గ నేతలతో పార్టీ రాష్ట్ర కార్యాయంలో శనివారం సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జీలు, సీనియర్ నేతలు సంకినేని వెంకటేశ్వర్రావు, చాడ సురేశ్‌రెడ్డితోపాటు ఆశావహులు, నియోజకవర్గ పరిధిలోని మండలాలు, పట్టణ శాఖల అధ్యక్షులు, నల్గొండ జిల్లా నేతలు సమావేశానికి హాజరయ్యారు. అభ్యర్థిత్వాన్ని త్వరగా ఖరారు చేయాలని ఆశావహులు ఈ సందర్భంగా కోరారు. ఉప ఎన్నిక కోసం ఇతర జిల్లాల నుంచి వచ్చిన నాయకులకు స్థానిక నేతల నుంచి సహకారం, సమన్వయం లేకపోవడంపై సంజయ్ ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. పార్టీ విధానానికి భిన్నంగా వెళ్తే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలిసింది. గుర్రంబోడు భూముల తరహాలో గిరిజనుల పోడు భూముల సమస్యపై ఏర్పాటు చేసే సభకు రావాలని నేతలు కోరగా సంజయ్ అంగీకరించినట్లు సమాచారం. ఉప ఎన్నిక సన్నద్ధతకు మార్చి 3, 4, 5 తేదీల్లో పోలింగ్‌బూత్ కమిటీల సభ్యులతో సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం సంజయ్ విలేకరులతో మాట్లాడారు. నాగార్జునసాగర్ ఉపపోరులో భాజపానే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నేతలతో సమీక్ష తర్వాత ఈ నమ్మకం పెరిగిందని.. అందుకే పార్టీలో అభ్యర్థిత్వానికి పోటీ ఎక్కువుందని వెల్లడించారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- Coronavaccine ఎవరెవరు వేసుకోకూడదు!
- ప్రేమించిన వ్యక్తితో కూతురు వెళ్లిపోయిందని...
- వైరస్ ప్రభావం త్వరలో తారస్థాయికి
- పిల్లల్లో పెరుగుతున్న ముప్పు
- ‘హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రే’
- Horoscope: ఈ రోజు రాశి ఫలం
- నేను ఎస్టీ కాదని రుజువు చేయగలరా?
- ఆక్సిజన్ లీకై సరఫరా నిలిచి 22మంది మృతి
- Tiktok స్టార్ భార్గవ్ చిప్పాడ అరెస్ట్
- భారత ఔషధ అవసరాలను అర్థం చేసుకున్నాం