కాంగ్రెస్‌లో చల్లారని లుకలుకలు
close

ప్రధానాంశాలు

కాంగ్రెస్‌లో చల్లారని లుకలుకలు

మోదీకి ఆజాద్‌ ప్రశంసలపై జమ్మూలో నిరసనలు

దిల్లీ: కాంగ్రెస్‌లో లుకలుకలు చల్లారడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఇటీవల గుజ్జర్లు ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సమావేశంలో ఆజాద్‌ పాల్గొని.. మోదీ ప్రధాని హోదాలో ఉన్నా ఏనాడూ తన మూలాలు దాచలేదని చెప్పారు. దానిపై కొందరు నేతలు మంగళవారం జమ్మూలో ఆజాద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆజాద్‌ భాజపాకి స్నేహ హస్తం అందిస్తున్నారని ఆరోపించారు. ఆయన్ని పార్టీ నుంచి తొలగించాలన్నారు.

వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు
ప్రధానిని ఆజాద్‌ పొగడలేదనీ, ఆయన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని ఆజాద్‌ సన్నిహిత వర్గాలు వివరణ ఇస్తున్నాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని