close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాష్ట్రం తెచ్చింది దోచుకోవడానికేనా?

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ప్రశ్న

ముషీరాబాద్‌, న్యూస్‌టుడే: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు తెరాస, భాజపాకు బుద్ధి చెప్పే పరిస్థితి స్పష్టంగా ఉందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కల్వకుంట్ల కుటుంబం, అనుచరులు దోచుకోవడానికే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న చందంగా మారిందని ఆరోపించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై కేసీఆర్‌కు ఏ మాత్రం గౌరవం ఉన్నా ఆయన కుమార్తె వాణీదేవికి గవర్నర్‌ కోటలో ఎమ్మెల్సీ సీటు ఇచ్చేవారని పేర్కొన్నారు. హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి డా.జి.చిన్నారెడ్డికి మద్దతుగా మంగళవారం సాయంత్రం ముషీరాబాద్‌లో నిర్వహించిన నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండేళ్ల కాలానికి నిరుద్యోగ భృతి చెల్లించాకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ ఓట్లు అడగాలని డిమాండ్‌ చేశారు. అఖిల భారత యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

నిరుద్యోగులను మోసం చేయడంలో భాజపా, తెరాసల పోటీ: భట్టివిక్రమార్క
గాంధీభవన్‌, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతను, నిరుద్యోగులను మోసం చేయడంలో పోటీ పడుతున్నాయని కాంగ్రెస్‌ శాసనసభా పక్షనేత భట్టివిక్రమార్క విమర్శించారు. ఆయన మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భాజపా, తెరాస నాయకులు ‘నువ్వెన్ని ఉద్యోగాలిచ్చావంటే.. నువ్వెన్ని ఇచ్చావ’ని ప్రజల ముందు నాటకాలాడుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారని మండిపడ్డారు. ఇద్దరూ ఎన్ని ఉద్యోగాలిచ్చారో చర్చకు రావాలని డిమాండ్‌ చేశారు. లేబర్‌ బ్యూరో తాజా లెక్కల ప్రకారం జాతీయ నిరుద్యోగ రేటు 21.6 శాతం ఉండగా.. తెలంగాణ నిరుద్యోగ రేటు 33.9 శాతం ఉందన్నారు. తెలంగాణలో ఉద్యోగ నియామకాల విషయంలో నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 50 వేల ఉద్యోగాల భర్తీ అంటూ మాయమాటలు చెబుతున్నారన్నారు. నిరుద్యోగులను మోసం చేస్తున్న తెరాస, భాజపాలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పట్టభద్ర ఓటర్లను కోరారు

మంత్రుల ప్రచారం చట్ట విరుద్ధం: కోదండరెడ్డి
మండలి ఎన్నికల ప్రచారానికి తెరాస పార్టీ మంత్రులను నియమించడం చట్ట విరుద్ధమని కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి అన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు