
ప్రధానాంశాలు
పెద్దక్కలా కాదు.. మేనత్తగానే మిగిలారు
మమతపై కోల్‌కతాలో మోదీ విమర్శలు
కోల్‌కతా: వామపక్షాల పాలన తర్వాత పశ్చిమబెంగాల్లో మార్పు తీసుకువస్తారని ప్రజలంతా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఆశలు పెట్టుకుంటే ఆమె మాత్రం వారిని వంచించి, అవమానించారని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. ఆదివారం సాయంత్రం కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో భాజపా నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ ముఖ్యమంత్రిని దుయ్యబట్టారు. ‘‘దీదీ (పెద్దక్క) పాత్ర పోషిస్తారని ప్రజలు మిమ్మల్ని (మమతను) ఎన్నుకున్నారు. మీరు మాత్రం వారిని విస్మరించి, మీ భతీజా (మేనల్లుడు అభిషేక్)కు బువా (అత్త)గా పరిమితమై బంధుప్రీతి చూపించడానికే మొగ్గుచూపారు. ప్రజల ఆశలపై నీళ్లు జల్లారు’’ అని విమర్శించారు. ‘‘అసమర్థత, భయం వల్ల మమతా దీదీకి ఆగ్రహం వస్తుంది. ఈ కోపంలో నన్ను రావణుడు అని, రాక్షసుడు అని, కొన్నిసార్లు గూండా అని తిట్టారు. మమతా..! అసలు మీకు ఎందుకు అంత కోపం?’’ అని మోదీ ప్రశ్నించారు.
* తృణమూల్ ఆట ముగిసిందని, ఇప్పుడు ఇక అభివృద్ధి మొదలవుతుందని మోదీ చెప్పారు. ఇటీవల మమత స్కూటీని నడపడాన్ని ఆయన ప్రస్తావించారు. ‘‘మీరు క్షేమంగా ఉండాలని మేమంతా కోరుకున్నాం. మీరు కింద పడకుండా, గాయపడకుండా ప్రయాణాన్ని ముగించగలిగారు. అయితే మీ స్కూటీ నేరుగా భవానీపుర్‌కు కాకుండా నందిగ్రామ్ వైపు మళ్లింది. అక్కడ మీరు బోల్తా కొట్టాలనుకుంటే మేమేం చేయగలం’’ అని మోదీ వ్యంగ్యంగా అన్నారు. దీదీ సృష్టించిన బురదలో కమలం వికసించబోతోందని చెప్పారు. బెంగాల్లో జరిగిన కుంభకోణాలతో అవినీతిపై ఒలింపిక్స్ పోటీ నిర్వహించవచ్చన్నారు.
* ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత ప్రధాని పాల్గొంటున్న తొలి సభ ఇదే కావడంతో భాజపా శ్రేణులు లక్షల సంఖ్యలో తరలివచ్చాయి. మోదీ నోటి నుంచి ‘అసొల్ పొరిబొర్తన్’ (అసలైన మార్పు) అనే బెంగాలీ మాటలు రాగానే మైదానం అంతా చప్పట్లతో మార్మోగింది.
భాజపాలో చేరిన మిథున్ చక్రవర్తి
ప్రధాని సభకు ముందు బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి భాజపాలో చేరారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయవర్గియా ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
130 కోట్ల మందీ నా స్నేహితులే
దేశంలోని 130 కోట్ల మంది ప్రజలూ తన స్నేహితులేనని ప్రధాని చెప్పారు. ఒక్క పశ్చిమ బెంగాల్‌లోని స్నేహితుల కోసమే తాను 90 లక్షల వంటగ్యాస్ కనెక్షన్లు ఇచ్చానని తెలిపారు. కొద్దిమంది కార్పొరేట్ మిత్రుల కోసమే ప్రధాని పనిచేస్తున్నారని విపక్షాలు తరచూ చేస్తున్న విమర్శలను మోదీ పరోక్షంగా తిప్పికొట్టారు. తాను పేదల నేస్తాన్నని చెప్పారు. భాజపాను బయటివారి పార్టీగా అభివర్ణిస్తుండడాన్ని తప్పుపట్టారు. భాజపాకు అధికారమిస్తే అన్ని వర్గాల పురోగతి ద్వారా అసలైన పరివర్తన తీసుకువస్తామని చెప్పారు. అక్రమ చొరబాట్లకు పూర్తిగా కళ్లెం వేస్తామన్నారు. పదేళ్ల తృణమూల్ పాలనలో లోక్తంత్ర (ప్రజాస్వామ్యం) కాస్తా లూట్తంత్ర (వ్యవస్థీకృత దోపిడీ)గా మారిందని, ప్రజాస్వామ్య వ్యవస్థను టీఎంసీ సర్కారు నాశనం చేస్తోందని ఆరోపించారు. భరతమాత ఆశీర్వాదంతో బంగారు బెంగాల్‌ను నిర్మిస్తామని హామీనిచ్చారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- Curfew: తెలంగాణలో నేటి నుంచి రాత్రి వేళ!
- మీ పేరుపై ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో తెలుసుకోండి
- కొవిడ్-19 ఎందుకింత ఉద్ధృతం?ఎప్పుడు ప్రమాదకరం?
- తొలుత జ్వరం అనుకుని.. చివరి నిమిషంలో మేల్కొని..
- Corona Vaccine : 44 లక్షల డోసులు వృథా
- Horoscope: ఈ రోజు రాశి ఫలం
- కార్చిచ్చులా కరోనా
- భారత్‌లో వ్యాక్సిన్లకు అమెరికా అడ్డుపుల్ల..!
- India Corona: కాస్త తగ్గిన కొత్త కేసులు
- ఆ డేటా ఫోన్లో ఉంటే డిలీట్ చేయండి: ఎస్బీఐ