close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అన్ని రంగాల్లోనూ తెలంగాణపై వివక్ష

‘బేచో ఇండియా’ తీసుకొచ్చిన కేంద్రం: కేటీఆర్‌

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: విద్యతోపాటు అన్ని రంగాల్లో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చెప్పే ‘సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌’ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. సికింద్రాబాద్‌లోని సెయింట్‌ మేరీస్‌ ఫార్మసీ కళాశాలలో సోమవారం ప్రైవేట్‌, ఎయిడెడ్‌, మైనార్టీ విద్యాసంస్థల అధ్యాపకులు, పట్టభద్రులతో ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. మేకిన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా అంటూ రకరకాల నినాదాలు తీసుకువచ్చిన ఎన్డీయే ప్రభుత్వం.. ప్రస్తుతం కేంద్ర రంగ సంస్థలన్నింటినీ అమ్మేసే ‘బేచో ఇండియా’ను తీసుకొచ్చిందని ఎద్దేవా చేశారు. అప్పుల్లో ఉందని ఎయిర్‌ ఇండియాను అమ్మేస్తున్నారని, ఎల్‌ఐసీని ఎందుకు అమ్మేస్తున్నారంటే లాభాల్లో ఉందనే సమాధానం చెబుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు వరుస సెలవులున్న నేపథ్యంలో.. ఎక్కడికి వెళ్లకుండా ఓటింగ్‌లో పాల్గొనాలని పట్టభద్రులకు సూచించారు. ప్రభుత్వ, ప్రతిపక్షాల పనితీరును చూసి ఓటు వేయాలని అభ్యర్థించారు. తెరాస అభ్యర్థి వాణిదేవి పీవీ కుమార్తెనే కాకుండా విద్యావేత్తగా, అధ్యాపకురాలిగా పట్టభద్రులు సమస్యలు అర్థం చేసుకునే మంచి మనిషి అని వివరించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు