నన్ను చంపడానికి భాజపా కుట్ర
close

ప్రధానాంశాలు

నన్ను చంపడానికి భాజపా కుట్ర

మమత సంచలన వ్యాఖ్యలు

కోల్‌కతా: తనను చంపడానికి భాజపా కుట్ర పన్నిందంటూ మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు తృణమూల్‌ నేతలను వేధించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా యత్నిస్తున్నారని ఆరోపించారు. ఏ గాయాలూ తన గెలుపును ఆపలేవంటూ పేర్కొన్నారు. బంకురా జిల్లాలో మంగళవారం ఆమె చక్రాల కుర్చీలో కూర్చొని ప్రచారం నిర్వహించారు. ‘‘అమిత్‌ షా తన ర్యాలీలకు జనాలు రాకపోవడంతో నిరాశకు గురయ్యారు. దేశాన్ని పాలించకుండా కోల్‌కతాలో కూర్చొని తృణమూల్‌కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారు. నన్ను చంపితే ఎన్నికల్లో గెలవచ్చని వారు భావిస్తున్నారా? అది సాధ్యం కాదు’’ అని మమత వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం విధుల్లో అమిత్‌ షా జోక్యం ఎక్కువవుతోందని, ఆయన ఆదేశాల మేరకే తన సెక్యూరిటీ డైరెక్టర్‌ వివేక్‌ సహాయ్‌ను తొలగించిందని పేర్కొన్నారు. ఈ పద్ధతి మారకపోతే ఎన్నికల సంఘం ఎదుట ధర్నా చేస్తానని హెచ్చరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని