close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మైనార్టీల్లో తగ్గుతున్న మమత!

అందుకే దీదీ ఆరాటం : మోదీ

కుచ్‌ బిహార్‌: మైనార్టీల ఓట్లు చేజారిపోతున్నాయన్న భయం పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలో స్పష్టంగా కనపడుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌కు గంపగుత్తగా ఓటేయాలని ముస్లింలను ఆమె కోరడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. హిందువులంతా ఏకం కావాలని మేం కూడా పిలుపునిస్తే మీడియా, ఎన్నికల సంఘం నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యేవన్నారు. మంగళవారం పశ్చిమ బెంగాల్‌లో పలు ఎన్నికల సభల్లో మోదీ ప్రసంగించారు. భాజపా విజయంపై ఢంకా భజాయిస్తున్న నేతలు.. దేవుళ్లా అంటూ మమత చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘‘ఇక్కడ ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడుతారు.. అన్నది తెలుసుకోవడానికి దేవుడిని ఇబ్బందిపెట్టాల్సిన అవసరం లేదు. దైవ రూపంలో ‘జనతా జనార్దన్‌’ (ప్రజలు) తమ స్పందనను తెలియజేస్తున్నారు. ‘‘దీదీ వైదొలగడం తథ్యం. రాష్ట్రంలో రెండు విడతల పోలింగ్‌ ముగిశాక ఇది స్పష్టమైంది. ఓటమి తప్పదని తెలిసే ఆమె అసహనానికి లోనవుతూ, నాపై విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల సంఘం నుంచి ఈవీఎంల వరకూ అన్నింటిపైనా ఆరోపణలు చేస్తున్నారు’’ అని విమర్శించారు. మే 2న ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక తృణమూల్‌ కాంగ్రెస్‌ విచ్ఛిన్నమవుతుందని బెంగాలీలు భావిస్తున్నట్లు చెప్పారు.  తృణమూల్‌ హయాంలో భారీగా అవినీతి రాజ్యమేలిందన్నారు. తన బెంగాలీ ఉచ్చారణపై మమత చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ.. అన్ని భాషలనూ గౌరవిస్తా. నేను మమతకు బెంగాలీ భాషలో లేఖ రాస్తే.. ఆమె గుజరాతీలో ప్రత్యుత్తరం ఇవ్వడం నాకు సంతోషాన్ని కలిగించింది’’ అని చెప్పారు.



ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు