close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అవి కాళేశ్వరం నీళ్లు కావు: పొన్నాల

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: కొండపోచమ్మ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం విడుదల చేసిన నీరు కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు కావని నీటిపారుదల శాఖ మాజీమంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి గోదావరి నీటిని విడుదల చేసి..కాళేశ్వరం నీరు అని పేర్కొంటూ తానేదో గొప్ప పని చేశానని సీఎం చెప్పుకొంటున్నారని విమర్శించారు.

సహకార సంఘాల్లో అవినీతిని అరికట్టాలి: అన్వేష్‌రెడ్డి

రాష్ట్రంలోని సహకార సంఘాల్లో పెద్దఎత్తున జరుగుతున్న అవినీతిని అరికట్టాలని కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆయన బుధవారం కిసాన్‌ కాంగ్రెస్‌ నాయకులతో కలిసి గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఖమ్మం జిల్లా సహకార బ్యాంకులో, మెదక్‌ జిల్లా కోనాపూర్‌ సహకార సంఘంలో నిధుల దుర్వినియోగంపై అధికారులకు ఫిర్యాదు చేస్తే విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు