close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
12, 13 తేదీల్లో సాగర్‌లో సంజయ్‌ ప్రచారం

ఈనాడు, హైదరాబాద్‌: నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రచార తేదీలు ఖరారయ్యాయి. ఈనెల 12, 13 తేదీల్లో ఆయన పర్యటించనున్నారు. బహిరంగసభలా, రోడ్‌షాలా? అన్నదానిపై పార్టీ నేతలు చర్చిస్తున్నారు. మరోవైపు తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారానికి ఆ రాష్ట్ర పార్టీ నుంచి సంజయ్‌కు ఆహ్వానం అందింది. 14వ తేదీన అక్కడకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది. గిరిజన సామాజికవర్గానికి చెందిన ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి అర్జున్‌ముండాను సాగర్‌ ప్రచారానికి రప్పించేందుకు కమలనాథులు ప్రయత్నాలు చేస్తున్నారు.

భగత్‌కు తెలంగాణ ఎమ్మార్పీఎస్‌ మద్దతు

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న తెరాస అభ్యర్థి నోముల భగత్‌కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్న మాదిగ, తెలంగాణ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ మాదిగలు తెలిపారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు