close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కృష్ణా జలాలను తెలంగాణకు తాకట్టు పెట్టేశారు

ఏపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమా ధ్వజం

తిరుపతి, న్యూస్‌టుడే: ఏపీలోని అసమర్థ ప్రభుత్వం కృష్ణా జలాలను తాకట్టు పెట్టేసిందని, దాన్నో ఘనకార్యంలా వాళ్ల పత్రికలో మొదటిపేజీలో రాసుకున్నారని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. తిరుపతిలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విభజన చట్టం పరిధిలో లేని ప్రాజెక్టులనూ కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం అంగీకరించడం దారుణమన్నారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర మొన్నటి ఎన్నికల కోసం డబ్బు తెచ్చుకున్నారని, అందుకోసం మన హక్కు అయిన కృష్ణా జలాలను సీఎం జగన్‌ తెలంగాణకు తాకట్టు పెట్టేశారని విమర్శించారు. ‘ఇక బోర్డు పరిధిలోనే నీటి విడుదల జరగబోతోంది. రాబోయే రోజుల్లో హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగుగంగ, వెలిగొండ, పోతిరెడ్డిపాడు, నాగార్జునసాగర్‌ ఆయకట్టు కింద నీళ్లు ప్రశ్నార్థకం కాబోతున్నాయి. గత 23 నెలలుగా దిల్లీలో జరుగుతున్న కుట్ర, కుతంత్రాలకు ఇది అద్దం పడుతోంది. ఈ నిర్ణయం వల్ల సీమాంధ్ర రైతాంగానికి ఉరితాడు పడింది’ అని ఉమా వాపోయారు. రైతులంతా గట్టి పోరాటం చేయకపోతే నష్టపోతామన్నారు. కేసుల నుంచి బయటపడేందుకు, పక్క రాష్ట్రంలో తన ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఏపీ హక్కుల్ని, నీటిని జగన్‌ తాకట్టు పెట్టారన్నారు. దీని వల్ల 200 నుంచి 300 టీఎంసీల నీళ్లు తెలంగాణకు వదులుకోవాల్సి వస్తుందని చెప్పారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు