close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నిరుద్యోగాన్ని సామాజిక ఎమర్జెన్సీగా ప్రకటించాలి: దాసోజు

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: తెలంగాణలో నిరుద్యోగ సమస్యను సామాజిక ఆత్యయిక పరిస్థితి(ఎమర్జెన్సీ)గా ప్రకటించాలని కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌ చేశారు. ఈ సమస్యపై చర్చించేందుకు వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం ముఖ్యమంత్రికి లేఖ రాశారు. నిరుద్యోగ భృతి వెంటనే విడుదల చేసి సంక్షోభంలో ఉన్న వారికి ఉపశమనం కల్గించాలని కోరారు. నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఐటీఐఆర్‌, గేమింగ్‌, యానిమేషన్‌ పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా నిరుద్యోగ సమస్యకు ప్రధాన పరిష్కారం దొరుకుతుందన్నారు. కొవిడ్‌ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన ప్రైవేట్‌ రంగ ఉద్యోగులకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ విడుదల చేయాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి, వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి రుణాలు విడుదల చేయాలని సూచించారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు