close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
దీదీ వ్యాఖ్యల వల్లే బలగాలపై దాడి

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

నదియా: భాజపా నేతలు, ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వంపై మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తిప్పికొట్టారు. ఐదో దఫా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నదియా జిల్లా శాంతిపుర్‌లో ఆయన రోడ్‌ షో నిర్వహించారు. సీఐఎస్‌ఎఫ్‌ బలగాల కాల్పుల ఘటన మినహా బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోందన్నారు. దీదీ (మమత) ప్రజలను రెచ్చగొట్టడం వల్లే సితాల్‌కుచిలో సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిపై దాడి జరిగిందని ఆరోపించారు. మే 2 తర్వాత బెంగాల్‌లో భాజపా అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అనంతరం రాజకీయ హింసకు ముగింపు పలుకుతామని స్పష్టం చేశారు. కూచ్‌బిహార్‌ ఘటనకు బాధ్యతవహిస్తూ హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలన్న మమత డిమాండ్‌ను ఆయన ప్రస్తావిస్తూ... ‘పశ్చిమ బెంగాల్‌ ప్రజలు కోరితే తప్పకుండా పదవి నుంచి వైదొలగుతాన’ని అమిత్‌ షా తెలిపారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు