close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గిరిజన రిజర్వేషన్ల పెంపునకు మద్దతిస్తాం

ఆ తీర్మానాన్ని ప్రత్యేకంగా పంపాలి
కేంద్ర సహాయ మంత్రి అర్జున్‌రామ్‌

ఈనాడు, నల్గొండ: తెలంగాణలో గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనకు కేంద్రం మద్దతు ఇస్తుందని కేంద్ర సహాయ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ అన్నారు. మైనారిటీలకు, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలని కేసీఆర్‌ తీర్మానం చేసి పంపారని, అలాకాకుండా కేవలం గిరిజనులకే ప్రత్యేకంగా రిజర్వేషన్‌ కల్పిస్తామంటే మద్దతు ఇస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో సుపరిపాలన, అభివృద్ధి కరవయ్యాయని విమర్శించారు. సాగర్‌ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ఆయన ఆదివారం హాలియాలో మీడియా సమావేశంలో మాట్లాడారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పక్కనే ఉన్నా నియోజకవర్గంలో తాగునీటికి ఇబ్బందులున్నాయని తెలిపారు. ‘‘గర్భిణులకు కేంద్రం రూ.6 వేలు ఇస్తుంటే కేసీఆర్‌ దాన్ని తన ఖాతాలో వేసుకొని ‘కేసీఆర్‌ కిట్‌’ అని పేరు పెట్టుకున్నారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన ద్వారా పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం సాయం చేస్తుంటే ఆ పథకాన్ని ఇక్కడ అడ్డుకుంటున్నారు. రాష్ట్రంలో పోడు భూములకు పట్టాలెందుకివ్వరు?’’ అని ప్రశ్నించారు. సాగర్‌ నియోజకవర్గంలో గిరిజన వర్సిటీ నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇసుక, డ్రగ్స్‌, లిక్కర్‌ మాఫియా చెలరేగుతున్నా పట్టించుకునే వారు లేరని మండిపడ్డారు. సమావేశంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సాగర్‌లో నేడు బండి సంజయ్‌ రోడ్‌షోలు
ఈనాడు, హైదరాబాద్‌: నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ తేదీ సమీపిస్తుండంతో కమలదళం ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తోంది. పార్టీ అభ్యర్థి డాక్టర్‌ రవికుమార్‌కి మద్దతుగా సోమవారం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, మాజీ ఎంపీ విజయశాంతి రంగంలోకి దిగుతున్నారు. గుర్రంపోడు, హాలియా మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో సంజయ్‌ రోడ్‌షోలు నిర్వహిస్తారు. రాత్రి 9 గంటల వరకు ప్రచారంలో పాల్గొని హైదరాబాద్‌ తిరిగివస్తారు. ప్రచారానికి చివరి రోజైన 15న మరోసారి వెళతారని పార్టీ ప్రకటించింది. విజయశాంతి తిరుమలగిరి, త్రిపురారం మండలాల పరిధిలో సోమవారం ప్రచారం చేయనున్నారు.

ఈఎస్‌ఐ కుంభకోణంలో ప్రభుత్వ పెద్దలు: డీకే అరుణ
రాష్ట్రంలో భూకబ్జాలు, కుంభకోణాలు తెరాస నేతల ప్రమేయంతోనే జరుగుతున్నాయని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆదివారం ఓ ప్రకటనలో ఆరోపించారు. ఈఎస్‌ఐ కుంభకోణంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని తమకు అనుమానం కలుగుతోందన్నారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు